-Advertisement-

Flash flash: స్కూల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ.. ఒక విద్యార్థి మృతి

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,నిర్మల్: స్కూల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఒక విద్యార్థి మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. 
నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం చించోలి(బి) వద్ద గల మైనార్టీ స్కూల్లో ఇద్దరు పదవ తరగతి విద్యార్థుల మధ్య గొడవ పడ్డారు. ఇద్దరు విద్యార్థుల గొడవలో అర్బాజ్(16) అనే విద్యార్థి మృతి చెందాడు. మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని మల్యాల గ్రామానికి చెందినవాడని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
Comments
User
Comment Poster
?
Replied
...
User
Comment Poster
Nice
Replied
👍
 -Advertisement-