-Advertisement-

Cotton Business : పత్తి రైతులను ముంచుతున్న దళారులు

Vaasthava Nestham

- గ్రామాల్లో విచ్చలవిడిగా అక్రమ కాంటాలు ఏర్పాటు చేసి పత్తి కొనుగోలు


- సిరిచేల్మ, మాదాపూర్, సిరికొండ మండలంలో అక్రమ వ్యాపారం


- పట్టించుకోని మార్కెట్ అధికారులు


వాస్తవ నేస్తం,ఇచ్చోడ: ప్రైవేట్ (దళారులు) వ్యాపారులు రైతులను నిలువునా ముంచుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంట విక్రయించడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పత్తి, ధాన్యం తదితరులు పంటలకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గతంలో మద్దతు ధర ప్రకటించంది. కానీ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అంతంత మాత్రమే ఉండటంతో చేసేదేమీ లేక రైతులు పత్తి మిల్లుల యాజమానుల, దళారులు ఆశ్రయిస్తూ వారు అడిగిన ధరకు అమ్ముకొని నష్టపోతున్నారు.మండల కేంద్రలోని సిరిచెల్మ, మాదాపూర్, సిరికొండ మండలంలో దళారులు అక్రమంగా కాంటాలు ఏర్పాటు చేసి నిబంధనలకు వీరుద్దంగా పత్తి కొనుగోలు చేపడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ తేమ పేరిట కొర్రీలు పెట్టి దోచుకుంటున్నారు. గ్రామాలలో దళారులు కాంటాలు ఏర్పాటు చేసి పత్తి తదితర పంటలను కొనుగోలు చేయకూడదని నిబంధనలు ఉన్నా కూడా యదేచ్చగా తమ దందాను కొనసాగిస్తున్నారు. ఇదంతా తెలిసి కూడా మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి దళారుల పైన చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
Vaasthava Nestham Telugu Daily

Comments
 -Advertisement-