-Advertisement-

Drugs , Steroid Seized : జిమ్,లో డ్రగ్స్, స్టెరాయిడ్స్ స్వాధీనం

Vaasthava Nestham

• డ్రగ్స్ తీసుకుంటూ జిమ్ కు వస్తున్న వారికి స్టెరాయిడ్స్ అందజేస్తున్న జిమ్ యజమాని పై కేసు నమోదు
• 20 ఎంఎల్ డ్రగ్, 36 స్టెరాయిడ్స్ టాబ్లెట్స్, మూడు డ్రగ్ ఇంజక్షన్లు స్వాధీనం.
• చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు : డిఎస్పీ జీవన్ రెడ్డి


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి తెలియజేశారు. గురువారం ఆదిలాబాద్ పట్టణం లోని నడిబొడ్డున వినాయక చౌక్ లోని లయన్ జిమ్ నిర్వాహకుడు షేక్ ఆదిల్ చట్ట వ్యతిరేకంగా డ్రగ్సును తీసుకుంటూ మరియు స్టెరాయిడ్స్ ను జిమ్కు వచ్చే వారికి అందజేస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు జిమ్ పై దాడులు నిర్వహించి 20 ఎంఎల్ ఏఎంపి ఇంజక్షన్ బాటిల్, మూడు ఇంజక్షన్లు, 36 స్టెరాయిడ్స్ టాబ్లెట్లను స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి తెలిపారు. సర్జరీకి వాడే డ్రగ్ 3 ఇంజెక్షన్లు లభ్యం, స్టెరాయిడ్ టాబ్లెట్లను జిమ్ కు వచ్చే వారికి అందజేసి వారి అనారోగ్యాల బారిన పడే విధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు జిమ్ నిర్వాహకునిపై కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ పేర్కొన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారుల సమక్షంలో జిన్ను సీజ్ చేసినట్లు డిఎస్పి తెలిపారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.