పెట్రోల్ ట్యాంకర్'లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: పెట్రోల్ ట్యాంకర్'లో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన లారీ డ్రైవర్ డయల్ 100 కు కాల్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని ఐటీడీఏ పెట్రోల్ పంప్ కు రామగుండం నుండి పెట్రోల్ ట్యాంకర్ లో పెట్రోల్ తీసుకు వస్తున్న క్రమంలో మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు వద్దకు పెట్రోల్ ట్యాంకర్ రాగానే క్లచ్ వైర్ ఊడి పోయి బ్యాటరీ వద్ద మంటలు చిలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్ అప్రమత్తమై డైల్ 100 కు కాల్ చేయడంతో స్పందించిన ఎస్సై తిరుపతి హుటాహుటిగా ఘటన స్థలానికి వెళ్లి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో మండలంలోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Comments