Breaking News : మాజీ ఎంపీపీ కిడ్నాప్..!?
By
Vaasthava Nestham
• మామడ మండలం మాజీ ఎంపీపీ హరీష్ కుమార్ కిడ్నాప్..!?
• నిర్మల్ జిల్లా మామడ మండలం పొనకల్ గ్రామంలో ఘటన
• మూడు కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు
• కిడ్నాపర్ల చెర నుండి చాకచక్యంగా తప్పించుకున్న మాజీ ఎంపీపీ
వాస్తవ నేస్తం,నిర్మల్: ఓ మాజీ ఎంపీపీ కిడ్నాప్..!?జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది.. నిర్మల్ జిల్లా మామడ మండలం మాజీ ఎంపీపీ హరీష్ కుమార్ ను దుండగులు కిడ్నాప్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో మామడ మండలం పొనకల్ గ్రామంలో ఆయన నివాసంలో నుంచి నిద్రలేపి మరి వాహనంలో కిడ్నాప్ చేసినట్లు చర్చలు జరుగుతున్నాయి. కిట్నాపర్లను కిడ్నాపర్లు మాజీ ఎంపీపీని కారులో హైదరాబాద్ తరలిస్తున్నట్లు, అదేవిధంగా కొంత డబ్బు అరెంజ్ చేయాలని మాజీ ఎంపీపీ తన సన్నిహితులకు ఫోన్లో సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద ఆగిన సమయంలో హరీష్ కుమార్ చాకచక్యంగా కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తూప్రాన్ పోలీస్ స్టేషన్ వెళ్లి జరిగిన సంఘటన గురించి పోలీసులకు వివరించారు. తూప్రాన్ పోలీసులు మామడ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాజీ ఎంపీపీ సేఫ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నది. కిడ్నాప్ జరిగిన మాట నిజమేనని తాను ప్రస్తుతం సేఫ్ గా ఉన్నానని ఎవరూ ఆందోళన చెందే అవసరం లేదని హరీష్ కుమార్ తమ సన్నిహితులకు ఫోన్ చేసి వివరించినట్లు ఆయన సన్నితులు చెబుతున్నారు.
Comments