-Advertisement-

Adilabad RTC : ఆర్టీసీ ప్రయాణికుల కష్టాలు నాకు అనవసరం..!

Vaasthava Nestham

• ఆర్టీసీ బస్సులు సురక్షితంగా ఉండాలి అంతే..!
• దూర భారమైతే నాకేంటి..
• ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించమని మీరే చెప్పండి 
• డయల్ యువర్ డీఎం కార్యక్రమంలో పలువురు ప్రయాణికులకు ఆర్టీసీ డీఎం నిర్లక్ష్యపు సమాధానాలు


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ప్రయాణికులే మన సంస్థకు నిధి.. అంటూ ఆర్టీసీ బస్సులలో పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది.. కానీ ఈ డీఎం చెప్పిన మాటలు వింటే మీరు విస్తుబోతారు.. ఆర్టీసీ ప్రయాణికులు పడుతున్న కష్టాలు నాకు అనవసరం.. నాకు ఆర్టీసీ బస్సులు సురక్షితంగా ఉంటే చాలు.. అంటూ బుధవారం ఆదిలాబాద్ ఆర్టీసీ డీఎం నిర్వహించిన డయల్ యువర్ డీఎం కార్యక్రమంలో ఇచ్చోడ మండలంలోని ప్రయాణికుల సమస్యలు పరిష్కరించి గ్రామం లోపలి నుండే ఆర్టీసీ బస్సులు వెళ్లేలా చూడాలని కాల్ చేసిన పలువురు ప్రయాణికులకు ఆదిలాబాద్ ఆర్టీసీ డీఎం చెప్పిన నిర్లక్ష్యపు సమాధానాలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. 
ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రయాణికుల సూచనలు , సమస్యల పరిష్కారాలు , ఫిర్యాదుల కోసం బుధవారం ఆదిలాబాద్ ఆర్టీసీ డిఎం ఆధ్వర్యంలో డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. సలహాలు సూచనలు, ఫిర్యాదుల కొరకు ప్రయాణికులు ఈ నంబర్,కు 9959226002 పలువురు ప్రయాణికులు కాల్ చేసి ఇచ్చోడ మండల మండల కేంద్రంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పలువురు ఆర్టీసీ డీఎంతో మాట్లాడారు. 

పూర్తి కథనం రేపటి సంచికలో..

Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.