-Advertisement-

మూడు రోజుల క్రితం అదృశ్యం..నేడు ఇంట్లోనే శవమై

Vaasthava Nestham

• కోకస్ మన్నూర్ గ్రామంలో యువకుడి మృతి


వాస్తవ నేస్తం,ఇచ్చోడ : ఆ యువకుడు మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. తన సెల్ ఫోన్ స్విచ్చాఫ్ పెట్టుకుని కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మూడు రోజుల అనంతరం శుక్రవారం పాత ఇంట్లో శవమై కనిపించ డంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడ మండలంలోని కోకస్ మన్నూర్ గ్రామానికి చెందిన కామ్రే గణేశ్ అనే యువకుడు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మూడు రోజుల క్రితం తన ఆటోను గ్రామంలోని జీపీ ఎదుట ఉంచి, సెల్ ఫోన్ స్విచ్చాఫ్ పెట్టుకుని కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఆచూకీ కోసం వెతికిన జాడ కనిపించలేదు. శుక్రవారం ఉదయం తల్లి లక్ష్మీ బాయి పాత ఇంటికి వెళ్ళి, తలుపులు తీయడంతో మంచంపై గణేశ్ విగతజీవిగా పడి ఉన్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉన్నాయి. మృతికి గల కారణాలు పోలీసులు విచారిస్తున్నారు.

మొన్న అల్లుడు... నేడు కొడుకు..


అదృశ్యమై.. శవంగా కనిపించిన మృతుడి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మూడు వారల క్రితమే మృతుడు కామ్రే గణేశ్ అక్క భర్త బొంగురాల గంగారాం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడు తూ అదిలాబాద్ రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మొన్న అల్లుడు, నేడు కుమారుడు మృతి చెందడంతో కామ్రే లక్ష్మీ బాయి ఇంట్లో విషాదం నెలకొంది.
Vaasthava Nestham Degital Media


Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.