-Advertisement-

పశువులు తరలిస్తున్న వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేసే ముఠా అరెస్ట్

Vaasthava Nestham

•నేరడిగొండ పోలీస్ స్టేషన్లో 11 మంది పై కేసు నమోదు 
• నలుగురు నిందితుల అరెస్ట్ 

• నేరడిగొండకు చెందిన చేతన్ సింగ్ , జంగిలి అన్వేష్..
• ఇచ్చోడాకు చెందిన మసీద్ ఆనంద్ ..
• ఆదిలాబాద్ కు చెందిన మహమ్మద్ మజార్ అరెస్ట్

• మహారాష్ట్రకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ సందీప్ కీరోల్ 
• భారీ బ్లాక్ మెయిలింగ్ దందా గుట్టు రట్టు చేసిన పోలీసులు
• వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠా దందాను పోలీసులు గుర్తు రట్టు చేశారు. పశువులు తరపు అక్రమంగా పశువులు తరలిస్తున్న వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాలో 11 మంది పై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ గుండా రాష్ట్రాల మీదుగా తరలించేందుకు ముఠాగా ఏర్పడి వాహనాలను తనిఖీ చేస్తూ వాహన యజమానులు డ్రైవర్ల వద్ద బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేయడం, డబ్బులు ఇవ్వని ఎడల వారిపై దాడులు చేస్తూ, పోలీసులకు ఫిర్యాదులు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతూ కొందరు ముఠాగా ఏర్పడి అక్రమాలకు పాల్పడ్డారు. 
ఈ ముఠాలో మహారాష్ట్ర యావత్ మాల్ జిల్లా కానిస్టేబుల్ సందీప్ , జిల్లా కేంద్రానికి చెందిన సంబంధించిన రోహిత్ షిండే అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించి ఈ అక్రమ దందాను కొనసాగించారు. అక్రమాలకు పాల్పడుతున్న ఈ ముఠాపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నేరేడుగొండ కు సంబంధించిన చేతన్ కుమార్, అన్వేష్, ఆదిలాబాద్ కు చెందిన మజార్, ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ఆనంద్ మొత్తం 11 మంది పై నేరడిగొండ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేకంగా దందాలకు పాల్పడి బెదిరింపులకు పాల్పడిన వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. బాధితులు ఎవరైనా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని నిర్భయంగా సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడా సీఐ బండారి రాజు, నేరేడిగొండ ఎస్సై ఇమ్రాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఒకరు కానిస్టేబుల్.. మరొకరు పోలీసుల వాహన డ్రైవర్ గా పనిచేసి...


అక్రమంగా పశువులు తరలిస్తున్న వాహనాలను ఆపి డబ్బు వసూలు చేసే ముఠాలో కీలక పాత్ర పోషించింది ఒక కానిస్టేబుల్ అయితే.. మరొకరు ఇచ్చోడ సర్కిల్ ఇన్స్పెక్టర్ వాహన డ్రైవర్ గా గతంలో పనిచేశారు. తమకున్న పరిచయాలతో ఈ అక్రమ దందాకు తెరలేపినట్టు తెలుస్తోంది. కానీ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నుండి అక్రమార్కుల్లా గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.