-Advertisement-

విషాదంలో ఉన్న కుటుంబానికి మరో షాక్..!!

Vaasthava Nestham

• విషాదం ఉన్న ఇంటినే లూటీ చేసిన దుండగులు 


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: విషాదంలో ఉన్న కుటుంబానికి మరో షాక్ ఇచ్చింది. అప్పటికే ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంతో కుటుంబం విషాదంలో ఉంది. అదే కుటుంబానికి దొంగలు షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సాయినగర్ కాలనిలో నివాసం ఉంటున్న జాధవ్ దేవిదాస్ రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడ్డాడు.
 
దీంతో ఆయన అంత్యక్రియల కోసం మృతుని స్వగ్రామమైన సొనాలా మండలం లోని ఘన్పూర్ గ్రామానికి కుటుంబసభ్యులందరు వెళ్లగా, ఇచ్చోడలో ఇంటికి తాళం వేసి ఉన్నట్లు గమనించిన దుండగులు తాళం పగలగొట్టి చోరికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న 20 తులాల వెండి, ఒక తులం బంగారం, పదివేల నగదు చోరికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.