-Advertisement-

Instagram : మనోడు.. పొట్టు పొట్టు నవ్విస్తుండు..!!

Vaasthava Nestham

• ఇంస్టా,లో కామెడీ వీడియోలతో అందర్నీ ఆకట్టుకుంటున్న సూర్య 
• వేలల్లో ఫాలోవర్స్.. మిలియన్లలో వ్యూస్..
• ఒకపక్క ప్రైవేటు ఉద్యోగం మరోపక్క ఇంస్టా,లో కామెడీ వీడియోలు 
• వేలలో ఫాలోవర్స్ , మిలియన్లలో వ్యూస్ ఉన్నా కూడా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయని సూర్య
• సినిమాల్లో నటించడం కోసం ప్రయత్నాలు 
• ఇంస్టా,లో ట్రెండింగ్ లో ఉన్న సూర్య పై వాస్తవ నేస్తం ప్రత్యేక కథనం


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఆ మామ ఎక్కడున్నావ్ రా.. ఆ మామ చెప్పు.. ఇంస్టాగ్రామ్ లో గా వీడియోకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి రా.. వాని కామెడీ వీడియోలు చాలా బాగుంటాయి. ఎవడ్రా వాడు ఆ నీకు తెలవదా.. మన సూర్య గాడు రా బై.. ఆ అవునా... అంటూ ఇద్దరు యువకులు ఓ హోటల్లో కూర్చొని ఫోన్లో డిస్కషన్ చేసుకుంటున్నారు.. ఆ యువకుడు ( Instagram account ) ఇచ్చోడ మండలం పొన్న గ్రామానికి చెందిన సూర్యా పై వాస్తవ నేస్తం ప్రత్యేక కధనం... యువత ఇంస్టాగ్రామ్ లో పాపులవ్వరవ్వడానికి రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ సంపాదించుకుంటున్నారు. వేళల్లో , లక్షల్లో ఫాలోవర్స్( Instagram followers )అయ్యాక కొందరు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ మరికొందరు బిట్ కాయిన్ కి సంబంధించిన వీడియోలు పెడుతూ లక్షలు కూడా పెట్టుకున్నారు. ఇందులో కొంతమంది కటకటాల పాలైనట్లు కూడా దాఖలాలు ఉన్నాయి. కాని కొందరు ఇంస్టాగ్రామ్ లో వీడియోలు చేస్తూ సినిమా ఛాన్స్ లు సైతం కొట్టేశారు. ఇంస్టాగ్రామ్ లో కామెడీ వీడియోలు తీస్తూ అందర్నీ కడుపుబ్బ నవ్విస్తున్నాడు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం పొన్న గ్రామానికి చెందిన యువకుడు సూర్య.. 

ప్రైవేటు ఉద్యోగం చేస్తూ...!!


సూర్య ఓ పక్క ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తనకు దొరికిన ఖాళీ సమయాల్లో ఇంస్టాగ్రామ్ లో తాను తీసిన కామెడీ వీడియోలు పోస్ట్ చేస్తూ అందర్నీ నవ్విస్తున్నాడు. సూర్య తన గ్రామానికి చెందిన కొంతమంది పిల్లను గ్యాంగ్ గా చేసుకొని కామెడీ వీడియోలు తీస్తూ అందరినీ పొట్టలు చెక్కలయ్యేలా నవ్విస్తున్నాడు. తాను తీస్తున్న కామెడీ వీడియోలు ఇంస్టాగ్రామ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి అంటే వారు చేసే కామెడీ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తనకు ఇంస్టాగ్రామ్ లో వేల మంది ఫాలోవర్స్ ( Instagram views )తాను తీసి వీడియోలు మిలియన్లలో వ్యూస్ వెళ్తున్న కూడా ఏ ఒక్కరోజు బెట్టింగ్ యాప్లు గాని ఫేక్ యాప్స్ ల గురించి గానీ ప్రమోషన్ చేయకుండా ఆదర్శంగా నిలుస్తున్నాడు.


Cine industry : సినిమాల్లో ఛాన్స్ కోసం ట్రై చేస్తున్న : సూర్య


ఎందరో ఫోక్ సింగర్లు తమ పాడిన పాటలకు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అట్రాక్టివ్ అయి సినిమాల్లో చాన్సులు ఇచ్చారు. అదే కోవాలో సూర్య సైతం కామెడీ వీడియోలు తీస్తూ సినిమాల్లో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు. తాను తీసి వీడియోలు ప్రత్యేకంగా ఉంటాయని, అందర్నీ కడుపుబ్బా నవ్విస్తాయని ఏదో ఒకరోజు తనకు కూడా సినిమాల్లో నటించడానికి అవకాశం వస్తుంది అని.. అదే ప్రయత్నం కోసం ముందుకు సాగుతున్నట్లు సూర్య చెప్పుకొచ్చాడు..
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.