నీటి కుంటలో దిగి ఆరుగురు చిన్నారులు మృతి
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఈత కోసం సరదాగా నీటి కుంటలోకి దిగిన చిన్నారులు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఏపీ ( Andhra Pradesh ) లోని కర్నూలు జిల్లా ( Kurnool ) ఆస్పరి మండలం చిగలి గ్రామంలో జరిగింది.
చిగలి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న ఏడుగరు విద్యార్థులు ఈతకని గ్రామ శివారులో ఉన్న కుంటలోకి దిగారు. వారిలో ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. మరో విద్యార్థి గ్రామంలోకి వెళ్లి విషయాన్ని తెలియజేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంటలోకి భారీగా నీరు చేరింది. చిన్నారులను కాపాడేందుకు దగ్గరలో ఎవరూ లేకపోవటంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments