అర్హులకు పూజ్యం.. అనార్హులకు అందలం..!
By
Vaasthava Nestham
• ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అవినీతి...
• జాబితాలో పేరు లేకున్నా తప్పుడు పత్రాలు సృష్టి
• అనార్హురాలి తో పంచాయతీ కార్యదర్శి కుమ్మక్కు
• బ్యాంక్ నుంచి నిధులు స్వాహా
• తప్పు చేసినట్లు పేపర్ రాసిచ్చిన జీపీ కార్యదర్శి వైనం
• ఇచ్చోడ మండలం నర్సాపూర్ లో వెలుగు చూసిన ఘటన
వాస్తవ నేస్తం,ఇచ్చోడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అవినీతి ఏరులై పారుతోంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మంజూరు జాబితాలో అర్హులైనా లబ్ధిదా రుల పేర్ల స్థానంలో అనర్హుల పేర్లు నమోదు చేస్తూ యధేచ్ఛగా కొందరు అధికారులు అడ్డదారిగా అవి నీతికి పాల్పడుతున్నారు. ఉన్నతాధికారులు పర్య వేక్షణ లేకపోవడం.. సంబంధిత శాఖల మధ్య సమ న్వయ లోపం కారణంగా ప్రభుత్వ ఆశయం నీరుగారు తోంది. అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ గ్రామానికి మొదటి విడతలో ప్రభుత్వం సుమారు 23 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ను మంజూరు చేసింది. ఈ గ్రామంలో ముస్లే నంద బాయి అనే ఇద్దరు మహిళలు ఉండడంతో సదరు గ్రామ పంచాయతీ కార్యదర్శికి వరంగా మారింది.
ఒకరికి మంజూరైతే..
గ్రామంలో ముస్లే నందబాయి భర్త పేరు సంతోష్, ముస్లే నందబాయి భర్త పేరు మారుతి అనే ఇద్దరు లబ్ధిదారులు ఉన్నారు. ముస్లే నందబాయి భర్త పేరు సంతోష్ అనే లబ్ధిదారురాలికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. ఇందిరమ్మ జాబితాలో మంజూరైనట్లు లబ్ధిదారురాలికి పంచాయతీ కార్యదర్శి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తెలియపర్చలేదనీ లబ్ధిదారురాలి భర్త సంతోష్ తెలిపారు.
మరొక నందబాయికి..
గ్రామంలో ఇదే ఇంటి పేరు గల నందబాయి భర్త పేరు
మారుతి ఉన్నారు. ఆమెకు ఇందిరమ్మ ఇళ్ల జాబితా లో ఇళ్లు మంజూరు కాలేదు. ఆమె మాత్రం ఇంటి నిర్మాణం చేపట్టింది. బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మిం చింది. అర్హురాలైన నందబాయి ఇంటి నిర్మాణం చేపట్టక పోవడం అనార్హురాలైన మరో నందబాయి ఇంటి నిర్మాణం చెప్పడంతో పంచాయతీ కార్యదర్శికి కలిసిరావడం.. ఆమెతో లోపాకారి ఒప్పందం కుదు ర్చుకున్నాడు. మొదటి దశ ఇంటి నిర్మాణ బిల్లు మంజూరు కాగానే అసలు లబ్దిదారురాలైనా ముస్లే నందబాయికి ఎలాంటి అనుమానం కలగకుండా బ్యాంకులో పని ఉందంటూ చెప్పి, ఆమెను ఇచ్చోడ బ్యాంక్ కు తీసుకువచ్చాడు. ఆమె ఖాతాలో ప్రభు త్వం జమ చేసిన మొదటి విడత డబ్బులు రూ. లక్ష రూపాయలను అనర్హురాలైన ముస్లే నందబాయి అకౌంట్ లోకి బదిలీ చేయించాడు. ఈ విషయం బాధితురాలు మా కుటుంబ సభ్యులకు చెప్పడంతో పంచాయతీ కార్యదర్శి సునీల్ నాయక్ ను నిలదీశారు.
వారం రోజుల్లో ఇస్తానని ఒప్పందం పేపర్ రాసి..
చేసిన తప్పును అంగీకరించి, బ్యాంక్ నుంచి డ్రా చేసిన డబ్బులను వారం రోజుల్లో ఇస్తానని ఒప్పంద పత్రం రాసి ఇచ్చాడు. గడువు ముగియడంతో కుటుంబ సభ్యులు డబ్బుల గురించి అడగడంతో మాట మార్చాడనీ, దీనిపై ప్రజా వాణి లో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై ఇచ్చోడ ఇంచార్జి ఎంపీడీఓ సత్యానంద్ ను వాస్తవ నేస్తం వివరణ కోరగా ఈ ఘటన విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు
Comments