-Advertisement-

Local body Eections: నేడే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్

Local body elections, Telangana , Local body elections meaning in telugu , Which authority conducts the local body elections , Who conducts local body
Vaasthava Nestham

• ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 

• ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్
• అమల్లోకి రానున్న ఎలక్షన్ కోడ్
• రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,763 ఎంపీటీసీ, 566 జడ్పీటీసీలు
• 12,760 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు 
• పల్లెల్లో నయా జోష్..


వాస్తవ నేస్తం,హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం ఎప్పుడు ఎప్పుడు నిర్వహిస్తుందో అని ఉత్కంఠతకు తెర పడనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం సిద్ధమైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించనుంది. ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు, జడ్పీ చైర్‌పర్సన్పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల గెజిట్ ను ప్రభుత్వం ఆదివారం రాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది.
రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతుండటం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా కోర్టు నోటీసులు పంపడంతో.. న్యాయపరమైన చిక్కులపై ఎన్నికల సంఘం ముందే చర్చించినట్టు తెలుస్తోంది. ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఆ తర్వాత సర్పంచ్ఎన్నికలు కూడా రెండు దశల్లో, అవసరమైన జిల్లాల్లో మూడు దశల్లో నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు దాదాపు హరారు అవ్వడంతో గ్రామాలలో నయా జోష్ నెలకొంది.


రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,763 ఎంపీటీసీ, 566 జడ్పీటీసీలు..


రాష్ట్రవ్యాప్తంగా 12,760 సర్పంచ్, 1,12,534 వార్డులు, 5,763 ఎంపీటీసీ, 565 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నిజానికి 566 ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ములుగు జిల్లా మంగపేట మండలానికి ఎన్నిక లేకపోవడంతో వీటి సంఖ్య ఒకటి తగ్గింది. 31 జడ్పీ స్థానాలకు చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డుల రిజర్వేషన్లతోపాటు పీఆర్కమిషనరేట్ఆఫీస్ నుంచి జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్పత్రాలను ఎస్ఈసీకి ఆదివారం రాత్రి పీఆర్అధికారులు అందించారు. అయితే, వీటికి సంబంధించిన స్కాన్కాపీలు కూడా పంపించాలని ఎన్నికల సంఘం కోరడంతో అన్ని జిల్లాల అధికారులు పంపించారు. లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే గ్రామాల్లో పోలింగ్కేంద్రాలు సిద్దం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 31,371 పోలింగ్కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామాలు, వార్డుల వారీగా ఓటరు జాబితాలు సైతం ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 1,87,03,168 మంది ఓటర్లలో 85,36,770 మంది మహిళలు, 81,65,894 మంది పురుషులు ఉండగా 504 మంది ఇతరులు ఉన్నారు. గ్రామీణ ఓటర్లలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. దీంతో వాళ్ల ఓట్లే కీలకం కానున్నాయి. సోమవారం ఎన్నికల షెడ్యూల్ ప్రభుత్వం ప్రకటిస్తుంది అని అనడంతో ఏ గల్లీని చూసిన ఎన్నికల కు సంబంధించిన ముచ్చట్లే జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించడంతో ఎంతో ఆశలతో ఎదురుచూస్తున్న కొందర నాయకుల రాజకీయ భవిష్యత్తు తలకిందులైంది.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.