-Advertisement-

Adilabad: నకిలీ ఎరువుల లారీ పట్టివేత

Vaasthava Nestham

- పట్టుబడిన నకిలీ ఎరువుల విలువ రూ.5.50 లక్షలు 


వాస్తవ నేస్తం,భీంపూర్: రైతుల అమాయకత్వాన్ని అవసరాన్ని ఆసరాగా చేసుకుని దళారులు, నకిలీ పత్తి విత్తనాలు విక్రయించే ముఠాలు రైతులను మోసం చేస్తున్నాయి. గత వారం రోజుల నుండి జిల్లాలో వర్షాలు పలుచోట్ల పడడంతో రైతులు పంట పొలాలను విత్తనాలు విత్తడానికి సిద్ధంగా చేసుకుని విత్తనాల కోసం ఫర్టిలైజర్ షాప్'ల ముందు బారులు తీరుతున్నారు. ఇదే ఆసరాగా చేసుకుని ఒకపక్క దళారులు మరోపక్క నకిలీ పత్తి విత్తనాలు, నకిలీ ఎరువులు విక్రయించే ముఠాలు సిద్ధంగా ఉన్నాయి. పోలీసులు పలుచోట్ల దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాలను అరెస్టు చేసిన కూడా కొందరు ఏ మాత్రం భయపడకుండా రైతులకు నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు విక్రయిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర ని ఆనుకొని ఉండడంతో మహారాష్ట్ర నుండి నకిలీ పత్తి విత్తనాలు, నకిలీ ఎరువులు విక్రయించే వారు ఈజీగా నకిలీ పత్తి విత్తనాలు, నకిలీ ఎరువులు జిల్లాలోకి దిగుమతి చేసుకుంటున్నారని ఆరోపణలు లేకపోలేదు. నకిలీ ఎరువులతో వెళ్తున్న లారీని ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలంలో పోలీసులు పట్టుకున్నారు. భీంపూర్ మండల వ్యవసాయ అధికారి రవీందర్ ఇచ్చిన సమాచారం మేరకు ఎస్సై ప్రదీప్ కుమార్, సిబ్బందితో కలిసి నకిలీ ఎరువులతో వెళ్తున్న లారీని పట్టుకున్నారు. అందులో 750 నకిలీ ఎరువుల బస్తాలు ఉన్నాయని, వాటి విలువ రూ.5,55,000/- విలువ ఉంటుందని ఎస్సై ప్రదీప్ కుమార్ తెలిపారు. లారీని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
 -Advertisement-