గల్లీక గణేష్ ఆగయా.. వైభవంగా గణేష్ చతుర్థి
By
Vaasthava Nestham
- భక్తులతో కిక్కిరిసిన ఇచ్చోడ..!
- గణేష్ చతుర్థి సందర్భంగా ఇచ్చోడ మార్కెట్లో సందడి
- గణేష్ విగ్రహాలు కొనుగోలు కోసం బారులు తీరిన జనం
- వాహనాల్లో తరలిన గణనాథులు
- పూజ సామాగ్రి కొనుగోలు కోసం తరలి వచ్చిన భక్తులు
- కొలువుదీరిన గల్లీక గణేష్
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో: భక్తిశ్రద్ధలతో గణేష్ చతుర్థి సందర్భంగా గల్లి గల్లిలో గణనాథులు కొలువుదీరారు. వినాయక చవితి సందర్భంగా జిల్లా కేంద్రంతో పాటు ఇచ్చోడ మండల కేంద్రం లోని మార్కెట్ భక్తులతో కిటకిటలాడింది. బోథ్ నియోజకవర్గానికి హబ్ గా ఉన్న ఇచ్చోడ మండల కేంద్రానికి బోథ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి భక్తులు వినాయకుని విగ్రహాల కొనుగోలు కోసం, పూజ సామాగ్రి కొనుగోలు కోసం ఇచ్చోడ మండల కేంద్రానికి తరలి రావడంతో మండల కేంద్రం జనసంద్రంగా మారింది. వినాయక విగ్రహాలకు కొనుగోలు కోసం వివిధ మండలాల నుండి వచ్చిన భక్తులు తాము కొనుగోలు చేసిన వినాయక విగ్రహాలను వాహనాల్లో తరలించారు. చిరు వ్యాపారులు చిన్న చిన్న గణేష్ విగ్రహాలు, పూజ సామాగ్రి, పండ్లు విక్రయించారు. చిరు వ్యాపారులకు పలువురు వాటర్ ప్యాకెట్లు, సమోసాలు పంపిణీ చేశారు. నవరాత్రుల సందర్భంగా బొజ్జ గణపయ్య ప్రత్యేక పూజలు అందుకున్నాడు.