-Advertisement-

మార్కెట్ యార్డులో రైతు ఆత్మహత్యయత్నం

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: మార్కెట్ యార్డులో రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే బోథ్
మార్కెట్ యార్డులో ఎన్ని రోజులైనా సోయా పంట కొనడం లేదని.. అవేదనతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. మండలంలోని కుచులాపూర్‌కు చెందిన రైతు ఎడ్మల మోహన్ రెడ్డి దాదాపు 30 క్వింటాళ్ల సోయా పంటను నాలుగు రోజుల కిందట మార్కెట్ యార్డుకు తీసుకొచ్చాడు. బుధవారం కూడా కొనుగోలు చేపట్టకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా తాను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని, సోయా సంచులు చోరీకి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని ఏఎంసీ ఛైర్మన్ గంగారెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తనవెంట తెచ్చుకున్న పురుగు మందు డబ్బా తీసి తాగేందుకు ప్రయత్నించారు. సహచర రైతులు అప్రమత్తమై వెంటనే అడ్డుకున్నారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.