-Advertisement-

యువతిని మోసం చేసిన కేసులో ఒకరి రిమాండ్

Vaasthava Nestham

• నలుగురి పై కేసు నమోదు


వాస్తవ నేస్తం,బోథ్: ఓ యువతిని పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి, కొన్నేళ్లుగా పెళ్లి చేసుకోకుండా మోసం చేసిన నిందితుడిని రిమాండ్ తరలించినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బోథ్ మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన కేసులో బోథ్ కు చెందిన మల్లెపూల వంశీ కుమార్ అనే వ్యక్తిని బుధవారం అరెస్టు చేసే రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా బాధిత యువతి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మల్లెపూల సత్యనారాయణ, మల్లెపూల భూలక్ష్మి, మల్లెపూల లింగారెడ్డి, మల్లెపూల రాములు పై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. మల్లెపూల సత్యనారాయణ గతంలో బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్'గా ఉన్నారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.