-Advertisement-

నేడు కేంద్ర బ‌డ్జెట్ 2025-2026

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఢిల్లీ: కేంద్ర ఆర్ధిక‌ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కేంద్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు. ఆమె బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుండి ఇప్ప‌టివ‌ర‌కు తాత్కాలిక బ‌డ్జెట్ ల‌తో క‌లిపి మొత్తం ఏడు బ‌డ్జెట్లు స‌మ‌ర్పించారు. ప్ర‌స్తుతం ఎనిమిద‌వ బ‌డ్జెట్‌ను లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెడుతున్నారు.
బ‌డ్జెట్ మ‌ఖ్యాంశాలు :

• వ‌చ్చే ఐదేండ్ల‌ కాలంలో దేశవ్యాప్తంగా 75 వేల మెడిక‌ల్ సీట్లు
• 2047 నాటికి 100 గిగావాట్ల అణువిద్యుత్ ఉత్ప‌త్తి
• 2030 నాటికి నాలుగు చిన్న‌, మ‌ధ్య‌స్థాయి రియాక్ట‌ర్ల ఏర్పాటు
• రూ. 20 వేల కోట్ల‌తో నేష‌న‌ల్ న్యూక్లియ‌ర్ ఎనర్జి మిష‌న్
• రూ.12 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు

వృద్దుల‌కు టిడిఎస్ ఊర‌ట

• వ‌డ్డీపై వ‌చ్చే ఆదాయంపూ రూ.50వేల నుండి రూ. ల‌క్ష‌కు పెంపు
• అద్దె ద్వారా వ‌చ్చే ఆదాయంపై 2.4 ల‌క్ష‌ల నుండి రూ.6 లక్ష‌ల‌కు పెంపు
• 36 ఔష‌ధాల‌కు బేసిక్ క‌స్ట‌మ్స్ డ్యూటి తొల‌గింపు
• దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్స‌ర్ సెంట‌ర్లు
• పిఎం ఆరోగ్య యోజ‌న కింద గిగ్ వ‌ర్క‌ర్ల కోసం హెల్త్ కార్డులు
• రాష్ట్రాల‌కు రూ.1.5 ల‌క్ష‌ల కోట్ల రుణాలు
• 50 ఏళ్ల‌కు వ‌డ్డీ ర‌హిత రుణాలు 
• మ‌హిళ‌లు, ఎస్ సి, ఎస్‌టి ఔత్సాహిత వ్యాపార‌వేత్త‌కు రూ.2 కోట్ల ట‌ర్మ్‌లోన్‌
• స్టార్ట‌ప్‌క‌లు ఇచ్చే రుణాలు రూ. 10 కోట్ల నుండి రూ.20 కోట్ల‌కు పెంపు ఎంఎస్ ఎంఇ ల‌కు రూ.5 కోట్ల నుండి రూ. 10 కోట్ల‌కు పెంపు
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.