వాస్తవ నేస్తం ఎఫెక్ట్.. అక్రమ వెంచర్'లో హద్దు రాళ్ళ తొలగింపు
By
Vaasthava Nestham
• వాస్తవ నేస్తం కథనానికి స్పందించిన అధికారులు
వాస్తవ నేస్తం,ఇచ్చోడ : "వాస్తవ నేస్తం" కథనానికి అధికారులు స్పందించారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అక్రమంగా వెలిసిన వెంచర్ ను సందర్శించారు. ఇచ్చోడ మండలంలోని కోకస్ మన్నూర్ గ్రామంలో అక్రమ వెంచర్ అనే కథనం శనివారం "వాస్తవ నేస్తం" లో ప్రచురితమైంది. ఈ శీర్షి కను జిపి కార్యదర్శి స్పందించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆడే మహేందర్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బందితో కలిసి అక్రమ పరిశీలించారు. వెంచర్ లో వేసిన హద్దులు, బండ రాళ్ళను పంచాయతీ సిబ్బంది చేత ఆయన తొలగించారు. ఈ సందర్భంగా పంచా యతీ కార్యదర్శి ఆడే మహేందర్ మాట్లాడారు. స్థానిక జీపీ నుంచి సంబంధిత రియాల్టర్ ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్నారు. అనుమతి లేకుండా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తూ గ్రామపంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్న వారు ఎలాంటి వారైనా ఉపేక్షిం చేదిలేదని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments