-Advertisement-

Gundihathoor : పసికందుపై ఊడి పడ్డ సీలింగ్ ఫ్యాన్

Vaasthava Nestham

• నిర్లక్ష్యం ఎవరిది..? సిబ్బందిది కాదా..!?


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ప్రమాదవశాత్తు పసికందుపై సీలింగ్ ఫ్యాన్ ఊడి పడింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో జరిగింది. మండలం లోని కొద్దుగూడ గ్రామానికి చెందిన పాయల్ అనే మహిళ రెండు రోజుల క్రితం గుడిహత్నూర్ ప్రాథమిక ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. 
కాగా ఈ రోజు ఉదయం(ఆదివారం) తల్లి, పాప ఉన్న బెడ్ పై ప్రమాదవశాత్తు సీలింగ్ ఫ్యాన్ తెగిపడింది. ఈ ఘటనలో పాపకు గాయాలు అయ్యాయి. విధులు నిర్వహించే సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని , హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసిపాపను చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రూమ్స్ కు తరలించారు.


Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.