-Advertisement-

RTC Bus Stand ; బురదలో కూరుకపోయిన బస్సు..!!

Vaasthava Nestham

• తప్పిన ప్రమాదం.. 
• మడుగును తలపిస్తున్న ఇచ్చోడ బస్టాండ్
• రోడ్డు పనులు పూర్తి అయిన కూడా మండల కేంద్రం లోనికి రాని ఆర్టీసీ బస్సులు 
• దూర భారంతో సతమతమవుతున్న ప్రయాణికులు 
• బస్సు ఎక్కాలంటే వర్షంలో సైతం ఊరు చివరన ఉన్న బస్టాండ్ వరకు వెళ్లవలసిందే 
• మండల కేంద్రంలో నుండే బస్సులు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు



వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : ఆ.. బస్టాండు మడుగును తలపిస్తోంది.. తరచూ ప్రయాణికులు బురదలో జారిపడి ప్రమాదాలకు గురి అవుతున్న కూడా అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇచ్చోడ మండల కేంద్రంలోని బస్టాండ్ బురదమయమైంది. నిర్మల్ బైపాస్ నుండి ఇచ్చోడ మండల కేంద్రం గుండా ఆదిలాబాద్ బైపాస్ వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న దృశ్య రోడ్డు పనులకు అంతరాయం కలకూడదని ఇచ్చోడ మండల కేంద్రానికి చివరన నిరుపయోగంలో ఉన్న ఆర్టీసీ బస్టాండులో ఆర్టీసీ బస్సులు వెళ్లేలా, అదేవిధంగా ప్రయాణికులు సైతం గ్రామానికి చివరన ఉన్న ఆర్టీసీ బస్టాండ్ కి వెళ్లి బస్సులు ఎక్కేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కానీ వర్షాకాలంతో ఆ బస్టాండు ఒక మడుగును తలపిస్తోంది. 
శనివారం బస్టాండ్ లోని బురదలో కూరుకుపయింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ బురదలో సైతం ఎందరో ప్రయాణికులు జారిపడుతూ ప్రమాదాలకు గురి అవుతున్నారు. అదేవిధంగా వర్షాకాలంలో ఊరు చివరన ఉన్న బస్టాండ్ కి వెళ్లి బస్సు ఎక్కాలి అంటే ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రంలోని రోడ్డు విస్తరణ పనులు 70% పూర్తి అయ్యి భారీ వాహనాలు మండల కేంద్రం లోనుండే రాకపోకలు సాగిస్తున్నాయి. భారీ వాహనాలు సైతం మండల కేంద్రం గుండా వెళ్తున్నాయి. కానీ ఆర్టీసీ బస్సులు మాత్రం మండల కేంద్రంలోకి రాకుండా బైపాస్ రోడ్డు గుండా వెళ్లి ఊరు చివరన ఉన్న బస్టాండ్ లోకి రావడంతో బస్టాండ్ లో దిగిన ప్రయాణికులు మండల కేంద్రం లోనికి రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర గ్రామాల నుండి వచ్చిన మహిళలు ఊరు చివరన ఉన్న బస్టాండ్లో రాత్రి సమయాల్లో దిగాలి అంటే భయపడుతున్నారు. 

ఇటీవల జరిగిన ఘటన..


ఇటీవల రాత్రి సమయంలో బస్టాండ్'లో దిగిన ఓ మహిళను మానసిక స్థితి బాగోలేని వ్యక్తి (పిచ్చి వ్యక్తి) బెదిరించడంతో సదరు మహిళ కేకలు వేస్తూ పరిగెత్తుతూ.. సదరు మహిళ కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం అందించడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఊరూ చివరలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ లోకి వెళ్ళారు. కుటుంబ సభ్యులు ఊరి చివరన ఉన్న సరైన సమయంలో బస్టాండ్ లోకి వెళ్లడంతో మానసిక స్థితి బాగోలేని వ్యక్తి (పిచ్చి వ్యక్తి) అక్కడి నుండి పారిపోయాడు. 


రోడ్డు పనులు పూర్తయినా కూడా మండల కేంద్రంలోకి ఆర్టీసీ బస్సులు రావా..??



నిర్మల్ బైపాస్ రోడ్డు వద్దనుండి మండల కేంద్రం గుండా ఆదిలాబాద్ బైపాస్ వరకు రోడ్డు విస్తరణ పనులు దాదాపు 70 శాతం పూర్తి అయిన కూడా ఆర్టీసీ బస్సులు ఇచ్చోడ గ్రామంలోనికి రాకపోవడంతో ప్రయాణికులు ఊరు చివరన ఉన్న బస్టాండ్ కి వెళ్ళాలి అంటే అష్ట కష్టాలు పడుతున్నారు. మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీ , నిర్మల్ బైపాస్ రోడ్డు వద్ద ఉన్న కాలనీల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా పట్టణానికి వెళ్లాలి అంటే ఊరి చివరలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ కి రావాలి అంటే దాదాపు మూడు కిలోమీటర్లు ప్రయాణించవలసి ఉంది. రోడ్డు పనులు దాదాపు పూర్తి అవ్వడానికి వచ్చినా కూడా , అదేవిధంగా భారీ వాహనాలు మండల కేంద్రంలోనుండే వెళ్తున్న కూడా ఆర్టీసీ బస్సులు లోనికి రాకపోవడం ఏంటి అని ప్రజలు ఆర్టీసీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు మండల కేంద్రం లోపల నుండే వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుని ప్రయాణికుల కష్టాలు తీర్చాలని మండల ప్రజలు కోరుతున్నారు.






Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.