-Advertisement-

Telangana lawcet : లా సెట్ ఫస్ట్ ర్యాంకర్ @ రుతిక

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: తెలంగాణ లా సెట్ ఫలితాల్లో రుచిత స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించి అందరి మన్ననలను పొందుతోంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన ఎల్చూరి రాజశేఖర్ కుమార్తె అయిన ఎల్చూరి రుతిక బుధవారం వెలువడిన లాసెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. 
చిన్నప్పుడు నుండి విద్యలో చురుకుగా ఉండే రుతిక న్యాయవిద్య అభ్యసించడమే లక్ష్యంగా లా సెట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచించింది. న్యాయవిద్యను అభ్యసించి పేద ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని రుతిక తెలిపింది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన రుతిక ను గ్రామస్తులు , కుటుంబ సభ్యులు ప్రశంసిస్తున్నారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.