పాల వ్యాపారం అన్నాడు.. డబ్బుతో ఉడయించాడు..!!
By
Vaasthava Nestham
• స్నేహం పేరుతో కుచ్చుటోపి
• పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తన మిత్రుడు
• 20 మంది నుండి రూ.32 లక్షలు అప్పుగా తీసుకొని పరారైన చెన్నపవర్ అభిషేక్
• వివరాలు వెల్లడించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: టీ వ్యాపారం అన్నాడు.. పాల వ్యాపారం అన్నాడు.. ఫైనాన్స్ దందా అంటూ ఇచ్చోడ మండల కేంద్రంలో అందర్నీ మంచిగా చేసుకున్నాడు. తనకు అవసరం ఉందని డబ్బు అప్పు తీసుకున్నాడు. తీరా అప్పు చెల్లించకుండానే పారిపోయాడు. ఇచ్చోడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నపవర్ అభిషేక్ అభిషేక్ అనే యువకుడు గత కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చోడ మండల కేంద్రానికి బతుకుజరువు కోసం వచ్చాడు. సేవా కార్యక్రమాలు అంటూ అందరిని మచ్చగా చేసుకున్నాడు.
పాల వ్యాపారం చేస్తున్నాను అంటూ తన మిత్రుని వద్ద రూ.4 లక్షల 50 వేలు అప్పుగా తీసుకున్నాడు. వినయంగా నటిస్తూ మరి కొంతమంది వద్ద దాదాపు రూ.32 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు చెల్లించకుండానే పారిపోవడంతో తన మిత్రుడైన
అక్కనపెల్లి శివకుమార్ చెన్నపవర్ అభిషేక్(శివ) పై ఆదివారం పోలీస్ స్టేషన్,లో ఫిర్యాదు చేశాడు. దీనితో అభిషేక్ పై కేసు నమోదు చేసి గాలింపు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు. ఇంకా ఎవరి వద్దనైనా డబ్బు తీసుకొని ఉంటే బాధితులు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సిఐ ప్రకటనలో పేర్కొన్నారు.
అప్పు చెల్లించుకున్నానే పరారైన టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు..
మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాల నుండి పోలీస్ స్టేషన్ ముందర ఏపీ నుండి వచ్చి ఓ వ్యక్తి అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ పేరుతో హోటల్ నిర్వహిస్తూ తన దగ్గరకు వచ్చే వారితో పరిచయాలు చేసుకొని అవసరానికి డబ్బులు అప్పుగా తీసుకొని అప్పు చెల్లించకుండానే గత మూడు నెలల క్రితం పరారైనట్లు సమాచారం. ఆ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు తీసుకున్న అప్పు దాదాపుగా 50 లక్షల పైనే ఉంటుందని మండలంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
Comments