Ex MPP Subhash Patel : మాజీ ఎంపీపీ మృతి
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల మొదటి ఎంపీపీగా ప్రజలకు సేవలు అందించిన సుభాష్ పాటిల్ మృతి చెందారు. ఇచ్చోడ మండలంలోని ధరంపూరి గ్రామానికి చెందిన సుభాష్ గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ, జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు (బుధవారం) మృతి చెందారు. ఈయన ఇచ్చోడ మొట్టమొదటి ఎంపీపీగా పని చేశారు. ప్రధాన పార్టీలైన టిడిపి , కాంగ్రెస్ , బిఆర్ఎస్ లో క్రియాశీల నాయకునిగా పనిచేశారు. ఈయన మృతిలో ధరంపురి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments