-Advertisement-

Real Estate Business : నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్ల విక్రయాలు

Vaasthava Nestham

• డబ్బుకు ఆశపడి కొందరితో కలిసి ఓ మహిళ రియల్ ఎస్టేట్ వ్యాపారం 
• నకిలీ పత్రాలు సృష్టించిన మహిళ అరెస్ట్
• వివరాలు వెల్లడించిన సీఐ ఫణిధర్


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: కొందరితో కలిసి ఓ ముఠాగా ఏర్పడిన ఓ మహిళ నకిలీ పత్రాలు సృష్టిస్తూ పాటలు విక్రయించి కటకటాల పాలయింది. ఆదిలాబాద్ రూలర్ పోలీస్ స్టేషన్ సీఐ ఫణిధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని బృందావన్ కాలనీకి చెందిన దాసరి జ్యోతి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా వ్యవహరిస్తూ, గెడం దేవిదాస్, గెడం జ్యోత్స్న దంపతుల నుండి రూ. 3లక్షల,30 వేలకు నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేసింది. 3 సంవత్సరాల క్రితం, గెడం దేవిదాస్, గెడం జ్యోత్స్న దంపతులు దాసరి జ్యోతి ఖానాపూర్ గ్రామ శివార్లలో సర్వే నంబర్ 68/100/2లో 764 నంబర్ గల ప్లాటును మధ్యవర్తిగా వ్యవహరిస్తూ రూ. 3లక్షల,30 వేలకు ప్లాట్ విక్రయించింది. గెడం దేవిదాస్ రూ. 1,50,000/-ను దాసరి జ్యోతికి చెల్లించారు.
మిగిలిన రూ.1,80,000/- రిజిస్ట్రేషన్ రోజున చెల్లించడానికి అంగీకరించారు. ఈ ఒప్పందం ఎలుగు ప్రేమందర్ సమక్షంలో జరగగా, దాసరి జ్యోతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో మహమ్మద్ కలీమ్ @ షేక్ కలీమ్ పాషాతో కలిసి రోడ్డ నర్సింహులు, రోడ్డ రవి, రోడ్డ నాగలింగు, రోడ్డ రమేష్ పేర్లతో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీని పేర్కొంటూ నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను సృష్టించి, మహమ్మద్ కలీమ్ @ షేక్ కలీమ్ పాషా పేరు మీద రిజిస్టర్ అయినట్లు చూపించి ఒప్పందం ప్రకారం, దాసరి జ్యోతి గెడం దేవిదాస్ నుండి మిగిలిన రూ. 1,80,000/-ను తీసుకుని, సర్వే నంబర్ 68/100/2లోని 708 నంబర్ గల వేరొక ప్లాటును గెడం జ్యోత్స్న పేరు మీద రిజిస్టర్ చేసింది. ఇందులో రూ. 1,00,000/-ను మహమ్మద్ కలీమ్‌కు తన వాటాగా ఇచ్చింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, దంపతులు ఆ నంబర్‌తో ప్లాటు లేదని, దాసరి జ్యోతి నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేసిందని తెలుసుకున్నారు. వారు ఆమెను సంప్రదించగా, ఆమె మరో సర్వే నంబర్ 68/8లో మరో ప్లాటును తమ పేరు మీద రిజిస్టర్ చేయడానికి సమయం ఇవ్వమని కోరింది. ఆమె గతంలో నకిలీ పత్రాలతో మోసం చేసినందున, వారు డబ్బు తిరిగి ఇవ్వమని అడగగా, ఆమె పారిపోయి డబ్బు చెల్లించకుండా మోసగించింది. నిందితులు *దాసరి జ్యోతి మరియు మహమ్మద్ కలీమ్ @ షేక్ కలీమ్ పాషా ఒక ప్లాటుకు నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను సృష్టించి, గెడం జ్యోత్స్న నుండి రూ. 3,30,000/- తీసుకుని మోసం చేశారు. ఈ సందర్భంగా వీరిపై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి నిందితురాలని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం సిఐ తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాలని పోలీస్ యంత్రాంగం మోసం చేసిన వారిని ఫోర్జరీ చేసిన వారిని చీటింగ్ చేసిన వారిని విడిచిపెట్టదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.