-Advertisement-

నకిలీ ఆధార్ కార్డులు, నివాస ధ్రువపత్రాలను తయారు చేసే ముఠా అరెస్ట్

Vaasthava Nestham

• నకిలీ ఆధార్ కార్డు, వివాహ దృవీ పత్రానికి ఒక్కొక్కరి వద్ద లక్ష రూపాయలు వసూలు చేసిన నిందితులు 
• నకిలీ ధ్రువీకరణ పత్రాలతో 9మంది కి ఉద్యోగాలు
• నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారుచేసింది 12 మంది నిందితులు 
• ముగ్గురు నిందితులు రిమాండ్
• వివరాలు వెల్లడించిన ఏఎస్పి కాజల్ సింగ్


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: డబ్బుకు ఆశపడి ఎందరో నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు. ఇదే తరహా ఘటన ఇచ్చోడ మండలంలో జరిగింది. ఇతర రాష్ట్రాల వారికి నకిలీ ఆధార్ కార్డు నివాస పత్రాలు తయారుచేసి ఇచ్చి ఒక్కొక్కరి వద్ద నుండి లక్ష రూపాయలు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్ ఇచ్చోడ మండలంలోని సర్కిల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. సూరజ్ అను వ్యక్తి ఇచ్చోడ మండలంలోని ఇస్లాం నగర్ గ్రామము, అని తప్పుడు నివాస ధ్రువీకరణ సర్టిఫికెట్ సృష్టించి సిఐఎస్ఎఫ్ నందు ఉద్యోగం సాధించాడు. 
పోలీసు వెరిఫికేషన్ లో భాగంగా అతన్ని చిరునామా తప్పుగా తేలింది. కాగా అతను వాస్తవంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. పోలీసులు లోతైన వితరణ చేపట్టగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 9 మంది ఇచ్చోడ నందు కొందరూ వ్యక్తులను సంప్రదించి వారికి ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించడం కోసం ఒక్కొక్కరికి వద్ద లక్ష రూపాయల చొప్పున మొదటగా దీపక్ తివారి అనే వ్యక్తి ఆధార్ కార్డు రూ.4000 లకు చేసి, నివాస ధ్రువీకరణ పత్రంపై పంచాయతీ సెక్రెటరీ వద్దకు వెళ్లగా, పంచాయతీ సెక్రటరీ గ్రామస్తులు కాదని సంతకం ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోగా దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఇస్లాం నగర్ మాజీ సర్పంచ్ భర్త షేక్ ఫరీద్, షేక్ ఖలీం లు, పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసి, మీ సేవలో అప్లై చేసి తప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ పొందారు. దీపక్ తివారీ ఉద్యోగంలో చేరిన తర్వాత మిగిలిన 8 మంది కూడా ఇలానే చేసి, మీ సేవలో అప్లై చేశారు. సర్టిఫికెట్లను వెరిఫై చేసినప్పుడు వారు ఇస్లాం నగర్ గ్రామానికి చెందినవారు కారు అని వారు ఫేక్ సర్టిఫికెట్ లతో ఉద్యోగాలు పొందారు అని నిర్ధారణ అయ్యింది. అయినప్పటికీ షేక్ ఫరీద్, షేక్ ఖలీం కలిసి మిగిలిన వారికి కూడా తప్పుడు రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు సృష్టించి ఇచ్చారు. దీనికిగాను మొత్తం రూ. 9 లక్షలకు ఒప్పందమయ్యి, ఇందులో రూ. 3 లక్షలు ఈ ఇద్దరికి వచ్చినట్టు తెలిపారు. మిగిలిన రూ. 6 లక్షలు ఉత్తర ప్రదేశ్‌లోని హుర్లిక్ వద్ద ఉన్నట్టు విచారణలో తేలింది అని ఏఎస్పి తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం విషయం తెలుసుకున్న జాధవ్ గజానంద్ (ఇస్లాం నగర్ వాసి) వీరిని బెదిరించగ ఈ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనని షేక్ ఖలీం, ఫరీద్ లు గజానంద్ కు రూ.20,000/- ఇచ్చారు. ఇట్టి వ్యవహారం బయటపడడంతో షేక్ కలీం, షేక్ ఫరీద్, జాదవ్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించి ఉద్యోగాలు చేస్తున్న వారిపై కూడా విచారణ కొనసాగుతుందిని, ఈ వ్యవహారంలో సహకరించిన వారిపై ప్రతి ఒక్కరి పైన చర్యలు తప్పవని ఏఎస్పి హెచ్చరించారు. 
Vaasthava Nestham Telugu Daily


Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.