-Advertisement-

RNI : ఆర్ఎన్ఐ అనుమతులు లేని పత్రికలపైనా నిఘా

Vaasthava Nestham

• ఎంక్వయిరీ చేయాలంటూ పీఆర్ఐజీ ఆదేశాలు జారి 
• ఆర్ఎన్ఐ అనుమతులు లేకుండా పత్రికలు నడుపుతే చర్యలే..


వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఆర్ఎన్ఏ లేకుండా కొందరు పీడీఎఫ్ పత్రికలు నడుపుతున్నట్లు సర్కరు దృష్టికి వచ్చింది. దీంతో ఆర్ఎన్ఐ అనుమతి నంబరు లేకుండా పత్రికలలో ఊహాజనిత వార్తలు ప్రచు రించే పీడీఎఫ్ పత్రికలపై చర్యలకు రంగం సిద్ధమౌతోంది. ఊరు, పేరు లేకుండా వార్తలను ప్రచురి స్తున్న పీడీఎఫ్ పత్రికలను గుర్తించాలని పీఆరీజీఐ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖకు ఆదేశాలిచ్చింది. దీంతో ప్రెస్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా మేరకు రాష్ట్ర పోలీసులు సైతం అన్ని జిల్లాలలోని పీడీఎఫ్ పత్రికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. 
ఇందులో భాగంగా పోలీసు బాసులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీపీఆర్ ఓలకు పీడీఎఫ్ పత్రికల సమాచారం అందించాలని లేఖ రాయనున్నట్లు తెలియవచ్చింది. ఇప్పటికే రాష్ట్ర సమాచార పౌర సంబం ధాల శాఖ ఉన్నతాధికారులు 33 జిల్లాలలో ఆర్ఎన్ఏ లేని పత్రికల పూర్తి సమాచారాన్ని సేకరించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చాయి. ఒకవైపు సమాచార శాఖ, మరోవైపు పోలీసు బాసులు ఊరు, పేరు లేని పత్రికలను గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు సమాయత్తమౌతున్నాయి.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.