-Advertisement-

Fake Certificate Scam : ఫేక్ సర్టిఫికెట్స్'తో ఆర్మిలో ఉద్యోగాలు

Vaasthava Nestham

• సహకరించింది ఎవరు..!? 
• అసలు తప్పు మిసేవా నిర్వాహకులదా..!? రెవిన్యూ యంత్రంగానిదా..!?
• ఉద్యోగాలు పొందిన వారు తమ గ్రామవాసులు కాదంటున్న స్థానికులు
• ఎస్.బీ అధికారుల ఎంక్వైరీలో తేలిన ఫేక్ సర్టిఫికెట్ల బాగోతం
• ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్'లో నివాసం ఉంటున్నట్లు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు 
 • ఫేక్ సర్టిఫికెట్ ల స్కాం వెనుక ఎవరున్నారనేది తేలాల్సి ఉంది


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్స్ తో ఆర్మీలో ఉద్యోగాలు పొందడం కలకలం రేపుతున్నాయి. ఫేక్ నివాస ధ్రువీకరణ పత్రాలతో జిల్లాలో 15 నుంచి 18 వరకు మంది ఉద్యోగాలు సాధించినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక జిల్లా అంటూ పక్క రాష్ట్రాలకు చెందిన వారికి రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు మంజురు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ లో నివాసముంటున్నట్లుగా పదుల సంఖ్యలో సర్టిఫికెట్లు పొందడం ఒక్కసారిగా గ్రామస్తులను ఉలిక్కిపడేటట్లు చేసింది. ఇండో టేబిటెన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పలువురు అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. విశ్వసనీయ సమాచారం మేరకు అంకిత్ పటేల్, బిపిన్ యాదవ్, జైనులు అబ్దిన్, అతుల్ కుమార్, హాబీబ్ ఖాన్, సూరజ్ ఖాన్, వికాస్ యాదవ్, ఇలా ఉద్యోగాలు సాధించిన వారి పేర్లు ఉన్నారు. 
ఈ పేర్లు గల వారు తమ గ్రామంలో ఎవరూ లేరని స్థానికులు సైతం తేల్చి చెప్తున్నారు. అనుమానం వచ్చి వెరిఫికేషన్ కు ఉన్నతాధికారులు ఆదేశించగా వీరంతా జన్యూన్ కాదని రెవెన్యూ అధికారులు తేల్చారు. ఆర్మీ ఉద్యోగాలకు ఫేక్ సర్టిఫికెట్ ల స్కాం వెనుక ఎవరున్నారనేది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. ఈ ప్రాంతం కాకున్నా పక్క రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడి అడ్రస్ తో దరఖాస్తు చేసుకున్నరనేది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. తీరా చూస్తే ఆధార్ కార్డులో అడ్రస్ లు మార్చి మీ సేవలో దరఖాస్తు చేసినట్లు వెల్లడైంది. ఇచ్చోడ మండలం ఓకే మీ సేవ నుండి ఇలాంటి దరఖాస్తులు చేసినట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. వాస్తవానికి ఇటీవలే విడుదలైన ITBP ఫలితాలలో సెలక్షన్ అయిన వారిని ఎంక్వైరీ కోసం స్థానిక SB అధికారులు సదరు ఇస్లంనగర్ గ్రామానికి వెళ్ళగా ఆ సదరు అధికారిగా నిజానిజాలు బయట పడ్డాయి. అసలు ఆ పేర్లతో ఉద్యోగాలు సాధించినవారు తమ గ్రామంలో లేరనడంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటకు పొక్కింది. ఏదేమైనప్పటికీ పక్కా రాష్ట్రాల నుంచి వచ్చి ఆధార్ కార్డులో అడ్రస్ లను మార్చుకొని ఫెక్ సర్టిఫికెట్ లు రెవెన్యూ కార్యాలయం ద్వారా పొందడంతో జిల్లా ఉన్నతాధికారులు జిల్లాలో ఉన్న ఆధార్ సెంటర్ నిర్వాహకులపై, ఇచ్చోడ మండల తహసీల్దార్ కార్యాలయం నుండి ఫేక్ సర్టిఫికెట్స్ లను దృవీకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఇస్లాం నగర్ గ్రామస్తులు కోరుతున్నారు. దీని వెనుక ఆన్న ఫేక్ సర్టిఫికెట్ ముఠాను సైతం ఛేదించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.