కలకలం రేపుతున్న మనిషి కళేబరాలు.. భయాందోళనలో ప్రజలు
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: మనిషి కాలేబరాలు రోడ్డుపైన కనిపించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని నారాయణ్ పూర్ గ్రామానికి కొద్ది దూరంలో, నిర్మల్ ఘాట్ రోడ్డు వద్ద మనిషి కళేబరాలు పడి ఉన్నాయి.
మనిషి యొక్క పుర్రె భాగము, నడుము భాగము, రెండు కాళ్ల భాగము క్రింది దవడభాగం, చేతి ఎముకలు మొదలగు కళేబరాలు ఉండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వెంటనే పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
Comments