-Advertisement-

అయ్యో పాపం..! మూగజీవులు

Vaasthava Nestham

• జొన్న లాప తిని 20 ఆవులు మృతి
• మృతి చెందిన ఆవుల విలువ సుమారుగా రూ. 4 లక్షలు 


వాస్తవ నేస్తం,బజార్ హత్నూర్ : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో ఒకేసారి 20 మూగజీవులు మృతి చెందాయి. వివరాల్లోకి వెళితే..మండలం లోని బుర్కపల్లి గ్రామంలోని శుక్రవారం ఆవులు రోజు వారీగా మేతకని వెళ్లి జొన్న లాపను తిని మృతి మృతి చెందాయి. దీంతో రైతులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మండల రెవిన్యూ అధికారులు రాథోడ్ నూర్ సింగ్ బుర్కా పల్లి గ్రామానికి వెల్లి సంఘటన స్థలాన్ని పరిశీలించి పంచనామ నిర్వహించారు. 

మృతి చెందిన ఆవుల యజమానుల పేర్లు ఆవుల సంఖ్య క్రింది విధంగా ఉంది:  

1.బర్ధవాల్ నానాక్ సింగ్ -03
2.టాక్ డా నానక్ సింగ్-4
3.మాటవాన్ గులాబ్ సింగ్-1
4.సబడే చందర్ సింగ్-1
5.బర్దా్వాల్ గురువే సింగ్-1
6.జాతీవే న్యాల్ సింగ్-1
7.జాతివే సుభాష్-1
8.నిస్తే హుషార్ సింగ్ -2
9.బనియ రామ్ -1
10.భామన్ పర్షు రామ్ 1
11.బస్సి హర్ సింగ్ 1
12.మాటవాన్ కాపుర్ చందు -2
13.మాటవాన్ గోపి చందు-1

మొత్తం 13 మంది రైతులకు చెందిన ఆవులు మరణించినవని రెవెన్యూ అధికారులు తెలిపారు. తమను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. చనిపోయిన ఆవుల విలువ ఒక్కొక్కటి రూ.20 వేలు అని, మొత్తం మృతి చెందిన 20 ఆవుల విలువ రూ.4 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. 



Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.