మృతదేహాన్ని వాగులో పాడేసినా బావ, బామ్మర్దులు
By
Vaasthava Nestham
• పంట రక్షణకు అమర్చిన విద్యుత్ తీగే ప్రాణం తీసింది
• పోలీసుల దర్యాప్తుతో ఇద్దరి అరెస్ట్
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : తమ పంటను అడవిపందుల నుండి రక్షించుకోవడం కోసం అమర్చిన విద్యుత్ తీగలు ఓ వ్యక్తి ప్రాణాన్ని బలికొన్నాయి. మృతి చెందిన వ్యక్తి మృతదేహం తమ చేనులో లభిస్తే తాము కటకటాల పాలవుతామని మృతదేహాన్ని బావ బామ్మర్దులు ఇద్దరు కలిసి నదిలో పడేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ సీఐ రాజు ఆదివారం వివరాలు వెల్లడించారు. ఇచ్చోడ మండలంలోని బాబ్జిపేట్ గ్రామానికి చెందిన పాండు, పంటను అడవి పందుల నుండి రక్షించుకోవడం కోసం విద్యుత్ తీగలను అమర్చాడు.
పంట చేనులో అమర్చిన విద్యుత్ తీగలు గమనించకుండా నేరడిగోండ మండలంలోని రోల్ మామడ గ్రామానికి చెందిన మండాడి శంభు విద్యుత్ తీగలను గమనించకుండా అటువైపు వెళ్లిగా విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు. ఇది గమనించిన పాండు, శంభు మృతదేహం తమ పంట చేనులో లభిస్తే కేసు నమోదు అవుతుందని గ్రహించి తన బామ్మర్ది అయిన ఈశ్వర్ సహాయంతో మృతదేహాన్ని కడెం వాగులో పాడేసినట్లు సీఐ తెలిపారు. పోలీసుల దర్యాప్తులో ఇట్టి విషయం తెలియడంతో శంభు మృతికి కారణమైన పాండు, అతని బామ్మర్ది అయినా ఈశ్వర్ ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. పంటల రక్షణకు విద్యుత్ తీగలు అమర్చితే ప్రమాదాలు జరుగుతాయని, ఎవరైనా పంట రక్షణ కొరకు విద్యుత్ తీగలు అమర్చితే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
Comments