Ichoda: ఇచ్చోడలో రెండు ఇండ్లలో దొంగతనం..
By
Vaasthava Nestham
• 17 తులాల బంగారం, 2.20 లక్షలు దొంగలించిన దుండగులు
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: మండల కేంద్రంలో రెండు ఇండ్లలో గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని టీచర్స్ కాలునికి చెందిన గేడం చంద్రకాంత్ , అడ్వకేట్ దమ్మపాల్ లు తమ ఇండ్లకు తాళం వేసి స్వగ్రామాలకు వెళ్లారు. తిరిగి ఆదివారం ఉదయం ఇళ్లకు రావడంతో తమ ఇళ్లకు ఉన్న తాళాలు పగలి పగలగొట్టి ఉండడం గమనించి ఇళ్లలోకి వెళ్లి చూడగా దొంగతనం జరిగినట్టు గ్రహించి పోలీసులకు సమాచారాన్ని అందించినట్లు వారు తెలిపారు. 17 తులాల బంగారం 2.20 లక్షల నగదు దుండగులు ఎత్తుకెళ్లినట్లు వారు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరించారు.
Comments