BC reservation : బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న బిసి రిజర్వేషన్ల పై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ (సోమవారం) అత్యున్నతధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణలో బిసి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కోట్టి వేసింది. బిసి రిజర్వేషన్లకు సంబంధించిన అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున తామూ విచారణకు స్వీకరించలేమని జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.
రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, అభిషేక్ సింఘ్వీ, ఎడిఎఎన్ రావు వాదనలు వినిపించారు. రెండు పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఆర్టికల్ 32 కింది ఎందుకు ఫైల్ చేశారని పిటిషనర్ తరఫు అడ్వకేట్‌ని జస్టిస్ విక్రమ్‌సింగ్ ధర్మాసనం ప్రశ్నించింది. దానికి… హైకోర్టు స్టే ఇవ్వనందున సుప్రీం కోర్టుకు వచ్చామని పిటిషనర్ తరఫున న్యాయవాదులు తెలిపారు. దాంతో ఒకింత ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీం కోర్టు వస్తారా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. అనంతరం పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది.
Comments