-Advertisement-

Keshavpanam Case: అధికారుల పై దాడి చేసిన కేసులలో ప్రధాన నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు

Vaasthava Nestham

• 11 కేసుల్లో ప్రధాన నిందితుడిగా షేక్ అల్తాఫ్
• షేక్ అల్తాఫ్ ను చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు.
• వివరాలు వెల్లడించిన ఇచ్చోడ సీఐ బండారి రాజు


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: పదేపదే నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఇచ్చోడ సీఐ బండారి రాజు అన్నారు. ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం గ్రామం పరిధిలోని ఫారెస్ట్ భూములలో చెట్టు నాటడానికి వెళ్లిన అటవీ అధికారుల పై దాడి, దౌర్జన్యానికి పాల్పడుతూ దాడి కేసులో ప్రధాన నిందితుడైన షేక్ అల్తాఫ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించడం జరిగిందని ఇచ్చోడ సీఐ బండారి రాజు ఓ ప్రకటనలో తెలిపారు. సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం గ్రామానికి చెందిన షేక్ అల్తాఫ్ మండలంలోని పలు గ్రామాలలో రైతులను దౌర్జన్యానికి గురి చేస్తూ, అక్రమంగా భూములను రాయించుకుంటూ, అమాయకులను మోసం చేస్తూ, అటవీ అధికారులపై, పోలీసు అధికారులపై దాడులకు పాల్పడుతున్నందుకుగాను ఇచ్చోడ పోలీస్ స్టేషన్ నందు పదకొండు కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Vaasthava Nestham Telugu Daily


నిందితుడు షేక్ అల్తాఫ్ పై ఆదివారం పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు. ఇట్టి నిందితుడి పై దౌర్జన్యం కేసులు భూములను అక్రమంగా రాయించుకున్న కేసులు, ఫారెస్ట్ అధికారులపై దాడి కేసులు మొత్తం 11 కేసులు నమోదు అయినట్లు సిఐ పేర్కొన్నారు. చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమే అని, నేరాలకు పాల్పడిన ఎంతటి వారైనా  ఉపేక్షించేది లేదని, పదేపదే నేరాలు చేసిన వారిపై పీడీ యాక్ట్ సైతం నమోదు చేయడానికి వెనకాడబోమని తెలిపారు. రౌడీయిజం చేసే వారిపై, గంజాయి రవాణా, గంజాయి వ్యాపారం, మాదకద్రవ్యాల వ్యాపారం, ఆర్థిక నేరస్తుల లపై జిల్లా పోలీసు యంత్రాంగం నిఘా ఏర్పాటు చేసి అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.