-Advertisement-

Local body Elections : తెలంగాణ లోకల్‌ బాడీ ఎన్నికలు నిలిపివేత

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బతగిలింది. తెలంగాణ లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నంబర్‌ 9 పై హైకోర్టు స్టే విధించింది. నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణలో భాగంగా ఏజీ తన వాదనలు వినిపిస్తూ.. 57.6 శాతం బీసీ జనాభా ఉందని సర్వేలో తేలిందని, బీసీల సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషనర్లకు రిపోర్ట్‌ ఎందుకు..? బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదు అని తెలిపారు. లోకల్ బాడీ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో ఆశవాహుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. 
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.