-Advertisement-

తప్పిన పెను ప్రమాదం... ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

Vaasthava Nestham

- నత్తనడకన రోడ్డు పనులు.. తరుచూ ప్రమాదాలు
- డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో తప్పిన ప్రమాదం


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఇచ్చోడ మండల కేంద్రంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు ఏడాది గడుస్తున్న కూడ పూర్తిచేసుకోవడంతో విస్తరణ పనులు ప్రమాదాలకు కేరాఫ్ గా మారాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు వరసల రహదారి పనుల్లో ఏడాది గడిచిన కూడా ఒక్కవైపు రహదారి పనులు పూర్తి పూర్తికాక పోవడం, సరిగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.



తరచు ప్రమాదాలు...


మండల కేంద్రంలో మంగళవారం ఇద్దరు ద్విచక్ర వాహనదారులు ఢీకొనడంతో తీవ్ర గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఘటన మర్వక ముందే బుధవారం మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద బ్రిడ్జ్ నిర్మాణం కోసం తవ్విన గుంతలో ఆర్టీసీ బస్సు పడి పెను ప్రమాదమే జరిగేది. ఆదిలాబాద్ నుండి నిర్మల్ కు వెళ్లే ఆర్టీసి బస్సులో సుమారు 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. పాత బస్టాండ్ వద్ద వంతెన నిర్మాణానికి గుంతా త్రవ్వి, ఇనుప రాడ్లు వేసి ఉంచారు. వంతెన నిర్మాణ పనులు రోజుల తరబడి చేయకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జ్ వద్ద ఒక మూల వైపు నుండి వాహనాలు మెల్లగా వెళ్ళాల్సి ఉండగా, మరో వైపు నుండి వచ్చె వాహనాలు ఆగిపోవాల్సిందే. బుధవారం బస్సు మూల మలుపుతుండగా ఒకేసారి వెనుక టైరు వంత నిర్మాణానికి తవ్విన గుంతలో దిగడంతో గమనించిన డ్రైవర్ వెంటనే బస్సులు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. లేనిచో దాదాపు 10 అడుగుల లోతు గల గుంతలు బస్సు పడితే పెను ప్రమాదమే జరిగేది. ఏది ఏమైనా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ కొరవడం వల్ల వంతెన నిర్మాణం అలస్యం కావడం పట్ల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా త్వరగా పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.

సామాన్య ప్రజలకే నా ట్రాఫిక్ రూల్స్...?


రహదారి పనులు జరుగుతుండడంతో మండల కేంద్రంలో ట్రాఫిక్ అస్తవ్యస్తమయింది. ట్రాఫిక్ ని అదుపు చేయవలసిన పోలీస్ శాఖ వారు కేవలం ద్విచక్ర వాహనదారులకి ట్రాఫిక్ రూల్స్ వర్తించేలా ఫోటోలు దింపడంలో అత్యుత్సాహం చూపించడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ ని అదుపు చేయాలంటే బడా వ్యాపారుల వాహనాలు రాత్రి సమయాల్లో వచ్చి సంబంధిత సరుకులు వారి దుకాణాల్లో దించుకోవలసిన నియమాలు ఉన్నప్పటికీ కూడా ఏకంగా రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నప్పుడు కూడా బడా వ్యాపురులు పెద్దపెద్ద వాహనాలు తమ దుకాణాల ముందు నిలుపుకొని సరుకులు దించుకుంటుండగా కూడా పోలీస్ శాఖ వారు చూసి చూడనట్టుగా వ్యవహరించడంపై మతలబు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ కేవలం సామాన్య ప్రజలకే నా..? ట్రాఫిక్ రూల్స్ బడా వ్యాపారులకు వర్తించవా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Vaasthava Nestham




Comments
 -Advertisement-