-Advertisement-

గురుకులంలో విద్యార్థినీ అదృశ్యం.. ఆచూకీ లభ్యం

Vaasthava Nestham

- కళాశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు


- ఎస్సై పనితీరును ప్రశంసిస్తున్న స్థానికులు


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: విద్యార్థిని అదృశ్యమై దాదాపు నాలుగు గంటల తర్వాత ఆచూకీ లభ్యమవ్వడంతో అందరూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం అభ్యసిస్తున్న ఓ విద్యార్థిని అదృష్టమైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. కళాశాలలో అదృశ్యమైన ఆ విద్యార్థిని వారం రోజుల క్రితమే సొంత గ్రామానికి వెళ్లింది. అనంతరం గురువారం మధ్యాహ్నం కళాశాలకు చేరుకుంది. చేరుకున్న విషయం, ఆపై ఆ విద్యార్థినీ కళాశాల నుండి అదృశ్యం కావడం సిబ్బందికి తెలియకపోవడం గమనార్హం.ఈ విషయం శుక్రవారం కళాశాల సిబ్బందికి తెలియడతో ఉటాహుటిన ప్రిన్సిపల్ ఇచ్చోడ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బస్సులో వెళ్తున్న విద్యార్థిని ఆచూకీని గుర్తించి కళాశాల అధికారులకు అప్పగించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. విద్యార్థునిలు కళాశాలలో ఉంటున్నారా..? బయటకు వెళ్తున్నారా..? కళాశాల సిబ్బందికి తెలియకపోవడం పై విద్యార్థునీల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments
 -Advertisement-