-Advertisement-

Adilabad Airport : ఆదిలాబాద్ కు కూడా ఎయిర్ పోర్టు తీసుకొస్తా

Vaasthava Nestham
• అసెంబ్లీ లో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటన

వాస్తవ నేస్తం, అదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ కూడా ఎయిర్ పోర్టు తెస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. శనివారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్ట్ విషయం గురించి ప్రస్తావించారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, రెండవ విడతలో అదిలాబాద్ కూ ఎయిర్ పోర్ట్ తెచ్చే బాధ్యత తాను తీసుకుంటా నని సిఎం హామీ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ సూచించిన వివరాలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. అసెంబ్లీ లో చేసిన సిఎం ప్రస్తావనతో జిల్లా వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.