జర్నలిస్టులంటే ఎవరు..? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం, హైదరాబాద్ : జర్నలిస్టులు అంటే ఎవరు అని తెలంగాణ అసెంబ్లీలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల ఓ అసభ్య కరమైన వీడియోను ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబాన్ని దారుణంగా దూషిస్తూ, పోలీసు రక్షణ లేకపోతే ఆయనను చంపేస్తానని ఎవరో ఓ వ్యక్తితో తిట్టించిన వీడియోను కొన్ని సోషల్ మీడియా హ్యాం డిల్స్ లో పోస్టు చేశారు. వారు జర్నలిస్టులని.. జర్నలిస్టుల్ని అరెస్టు చేశారని రేవంత్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు. విమర్శలపై రేవంత్ అసెంబ్లీ లో ఘాటుగా స్పందించారు. ఎవరు జర్నలిస్టులు అని నేను ఈ వేదికపై నుంచి అడగదల చుకున్నాను. ఐఅండ్‌పీఆర్ లేదా డీఐబీపీ ఆమో దించిన పత్రికలు, ప్రసార సాధనాలు, వాళ్లు ఇచ్చే ఐడీ కార్డులు ఉన్న వాళ్లు జర్నలిస్టులా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు జర్నలిస్టులు ఎలా అవుతారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం గుర్తించిన పత్రికలు, మీడియా సంస్థలు, అక్కడ పని చేసే ప్రతినిధులు జర్నలిస్టులా లేకా కుటుంబాలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్లు జర్నలిస్టులా అని ప్రశ్నించారు. ఎవడు పడితే వాడు ఏదో ట్యూబ్ పెట్టుకొని ఇష్టారాజ్యంగా తిట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఓపిక పడతున్నామని.. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లి దండ్రులు లేరా, మీ అమ్మనో చెల్లినో ఇలా అంటే వింటారా అని ప్రశ్నించారు. జర్నలిస్టు ముసుగులో చేసే కామెంట్స్‌పై అందరూ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి కొన్ని రెగ్యులరేషన్స్ తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇదో విష సంస్కృ తిలా మారిపోతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. నీచమైన భాషతో వాళ్లు చేసే కామెంట్స్‌లో తన పేరు తీసేసి వాళ్లను ప్రోత్సహించే వాళ్ల పేర్లు పెట్టుకొని చూడలని సూచించారు. ఆ బాధ ఏంటో అప్పుడు తెలుస్తుందన్నారు. ముఖ్యమంత్రిగా చెబుతున్నాను .. బట్టలు విప్పి రోడ్డు మీద తిప్పిస్తానని హెచ్చరించారు. ప్రజాజీవితంలో ఉన్న మమ్మల్ని విమర్శించండి. విశ్లేషించండి. మా గురించి మాట్లాడండి. ఇంట్లో ఉన్న ఆడబిడ్డల గురించి మాట్లాడితే సహించేది లేదన్నారు. ప్రజాస్వామ్యయుతంగా విమర్శించండి. సరిద్దికోవడానికి సిద్ధంగా ఉన్నామని గౌరవిస్తామన్నారు. చట్టపరిధిలోనే శిక్షిస్తామని హెచ్చరించారు.
Comments