-Advertisement-

Aadhar card morphing : ఆధార్ కార్డులు మార్ఫింగ్ చేస్తే చర్యలు తప్పవు

Vaasthava Nestham

• ఆధార్ కార్డులో పుట్టిన తేది మార్ఫింగ్ చేసిన జిరాక్స్ సెంటర్ నిర్వాహకునిపై కేసు నమోదు 
• వివరాలు వెల్లడించిన ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్ 


వాస్తవ నేస్తం,ఇచ్చోడ: ఆధార్ కార్డు మార్కింగ్ చేసిన జిరాక్స్ సెంటర్ నిర్వాహకునిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ శనివారం పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ఏఎస్పీ కాజల్ సింగ్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. దాబా(బి) గ్రామానికి చెందిన మన్నె కృష్ణ వ్యవసాయ భూమిపై రుణ నిమిత్తం అవసరమైన పత్రాల జిరాక్స్ కోసం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వద్ద ఉన్న జిరాక్స్ సెంటర్ కు వెళ్ళగా.. ఆ జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు అబ్దుల్ తన్వీర్ ఓ ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్ఫింగ్ చేస్తుండగా చూసి, సదరు వ్యక్తి ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై పురుషోత్తం ఆ జిరాక్స్ సెంటర్ లోని వస్తువులను సీజ్ చేసి జిరాక్స్ సెంటర్ నిర్వాహకునిపై కేసు నమోదుచేసి రిమాండ్ కు తరలించినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారి అయిన ఎంతటి వారైనా సహించేది లేదని ఏఎస్పీ హెచ్చరించారు. పేకాట, మట్కా, గంజాయి కి సంబంధించిన సమాచారాన్ని ప్రజలు పోలీసులకు అందించాలన్నారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.