-Advertisement-

మీ సేవలు మరువలేనివి..!

Vaasthava Nestham

• హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా ఎంపికైన ప్రభాకర్ ను సన్మానించిన వాగ్దారి గ్రామస్తులు 


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా నిర్వహిస్తూ ఇటీవల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా ఉద్యోగం పొందిన ప్రభాకర్ ను నేరడిగొండ మండలంలోని వాగ్దారి గ్రామ ప్రజలు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ మురళి మాట్లాడుతూ.. మీ సేవలు మరువలేనివని , ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల విధులు నిర్వహించారని సేవలు ప్రశంసనీయమన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటిని గ్రామంలో అమలు చేస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించారని అన్నారు. మునుముందు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు భావోద్వేగానికి గురయ్యారు. ప్రభాకర్ మాట్లాడుతూ.. వాగ్దారి గ్రామ ప్రజలు చూపించిన ప్రేమ అభిమానాలు మర్చిపోలేనివి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్లు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.