Ekadashi: ఘనంగా తొలి ఏకాదశి పండుగ
By
Vaasthava Nestham
• విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
వాస్తవ నేస్తం,బజార్హత్నూర్: మండలంలోని భూతయి(బి) గ్రామంలో ఏకాదశి పండుగ ఘనంగా నిర్వహించారు. ఆషాడ ఏకాదశి సందర్భంగా సాంప్రదాయబద్ధంగా భజన కార్యక్రమం నిర్వహిస్తూ గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం గ్రామంలోని విఠలేశ్వర మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామంలో చిన్న పెద్ద తేడా అనే లేకుండా ప్రతి ఒక్కరు శోభాయాత్రలో పాల్గొని నృత్యాలు చేశారు. అనంతరం విఠలేశ్వర ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఫడ్ ననేశ్వర్, యువకులు , మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments