Ration Cards : రేషన్ కార్డుల జరిపై జరుగుతున్న అవినీతిని అరికట్టాలి
By
Vaasthava Nestham
• డీఎస్ఓ పై అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు
• బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు మజర్
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : రేషన్ కార్డుల జారీలో అక్రమాలు జరుగుతున్నాయని , రేషన్ కార్డుల కోసం పేద ప్రజలు చేసుకున్న దరఖాస్తులు డిఎస్ఓ వద్ద పెండింగ్,లో ఉన్నాయని దీనిపైడీఎస్ఓ తో మాట్లాడగా నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పడం ఏంటి అని బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు మజర్ బుధవారం అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రేషన్ కార్డ్ ల జారిలో కొందరు దళారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని అడిషనల్ కలెక్టర్ కు ఆయన వివరించారు. డీఎస్ఓపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు దరఖాస్తు చేస్తున్న రేషన్ కార్డును తొందరగా జారీ అయ్యే విధంగా చూడాలని అడిషనల్ కలెక్టర్ ను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బజార్ హత్నూర్ మండల యువజన సంఘం అధ్యక్షుడు డుబ్బుల చంద్రశేఖర్, ప్రభాకర్, సాయి, రామ్ తదితరులు ఉన్నారు.
Comments