The Assam Rifles : కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకుంటే..!!
By
Vaasthava Nestham
• శిక్షణలోనే తనువు చాలించిన జవాన్..
• శోకసముద్రంలో కుటుంబ సభ్యులు
• వర్తమన్నూర్ గ్రామంలో విషాద ఛాయలు
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఇంకా 15 రోజుల్లో శిక్షణ పూర్తి అవుతుంది.. శిక్షణ అనంతరం పరేడ్ సెల్యూట్ parade salute కార్యక్రమానికి వెళ్లడానికి కుటుంబ సభ్యులు వెళ్దామనుకునే క్రమంలోని ఆ కుటుంబానికి వచ్చిన సమాచారం ఆ కుటుంబం ఆ కుటుంబం పై పిడుగు పడినంత పని అయింది.
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ (Army Jawan )మండలం వర్తమన్నూర్ గ్రామానికి చెందిన నలువల ఆకాష్ ఆరు నెలల క్రితం అస్సాం రైఫిల్స్ లో జవాన్,గా The Assam Rifles ఎంపికయ్యాడు. జవాన్,గా శిక్షణ తీసుకుంటున్న క్రమంలో 20 KM రన్నింగ్ చేస్తుండగా ఒక్కసారి కుప్ప కూలిపోయాడు. అది గమనించిన అధికారులు ఆ యువకుడిని హుటాహుటిగా హాస్పిటల్,లు తరలించారు. రన్నింగ్ చేస్తున్న క్రమంలో ఆకాష్ డిహైడ్రేషన్,తో మృతి చెందినట్లు అధికారులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆ కుటుంబానికి తమ కుమారుడు అండగా నిలుచునే సమయంలోనే ఆ యువకుని మృతితో కుటుంబం శోకసముద్రంలో మునిగింది. మృతి చెందిన యువకుని మృతదేహం ఆ యువకుడి స్వగ్రామమైన వర్తమన్నూర్,కి తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందరితో కలిసి మెలిసి ఉండే ఆకాష్ మృతితో తన స్నేహితులు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఆకాష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.
Comments