-Advertisement-

Operation Jwala : ఆపరేషన్ జ్వాలతో విద్యార్థినిలలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం పెంపు

Vaasthava Nestham

• విద్యార్థినిల స్వీయ రక్షణలో ఆపరేషన్ జ్వాల కీలకపాత్ర
• ఆపరేషన్ జ్వాలాలో విద్యార్థినిలకు కరాటే శిక్షణ
• జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలో దశలవారీగా ఆపరేషన్
జ్వాల ప్రారంభం 

• మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో లాంచనంగా ఆపరేషన్ జ్వాల ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఆపరేషన్ జ్వాలతో విద్యార్థినిలలో ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆపరేషన్ జ్వాలాలో విద్యార్థినిలకు స్వీయ రక్షణ కోసం కరాటే శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్పీ తెలిపారు. శుక్రవారం లాంచనంగా మహాత్మ జ్యోతి పులే పాఠశాలలో ఆపరేషన్ జ్వాల కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్టి మాట్లాడుతూ.. కరాటే శిక్షణ తరగతులను ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు, పలు ప్రభుత్వ, ప్రైవేటు కరాటే అధ్యాపకుల సహకారం చే శిక్షణను అందించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఒక గంట సమయం విద్యార్థినిలకు ప్రత్యేకంగా శిక్షణా తరగతులు ఉండనున్నట్లు, దీనికి సహకరించిన జిల్లా విద్యాశాఖ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. 
జ్వాలా ముఖ్య ఉద్దేశం విద్యార్థులలో చిన్నతనం నుండి ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా జిల్లా పోలీస్ యంత్రాంగం తమ వంతు ప్రయత్నాన్ని ప్రారంభించిందన్నారు. ఆపరేషన్ జ్వాలాతో మహిళా విద్యార్థుల్లో, చిన్నారులలో ఆపద సమయంలో స్వీయ రక్షణతో తమను తాము కాపాడుకునే ధైర్యాన్ని కలిగి ఉంటారని తెలిపారు. మహిళలు విద్యార్థులు ఎలాంటి ఆపద సమయంలోనైనా ఇలాంటి శిక్షణ కార్యక్రమాల వల్ల నేర్చుకున్న పద్ధతులను ఉపయోగించి తమను తాము కాపాడుకోగలుగుతారని, విద్యార్థుల ధైర్య సాహసాలు పెంపొందించబడతాయని, ఆపద సమయంలో జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించే అంత శక్తి లభిస్తుందని, మహిళలకు ఎల్లవేళలా అందుబాటులో జిల్లా షీ టీం బృందాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మహిళల పట్ల జరుగు నేరాల ను తగ్గించడానికి జిల్లాలో వినూత్నంగా ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని మహిళల్లో విద్యార్థినిలల్లో చైతన్యం తీసుకొని వచ్చి అన్ని రంగాల్లో ముందుండాలని సదుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని నేర్చుకోవాలని సూచించారు. ఈ పాఠశాలలో దాదాపు 500 మంది విద్యార్థులు ఆపరేషన్ జ్వాల ద్వారా శిక్షణ ను తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, కళాశాల ప్రధానోపాధ్యాయులు, పట్టణ సీఐలు, కరాటే శిక్షణ ను అందించే ప్రైవేటు ప్రభుత్వ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.