-Advertisement-

ఈతకు వెళ్లి యువకుని అనుమానాస్పద మృతి

Vaasthava Nestham

• మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేస్తే కఠిన చర్యలు
• ఇచ్చోడ సీఐ బండారి రాజు


వాస్తవ నేస్తం,ఇచ్చోడ : ఈతకు వెళ్లి ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. ఆదివారం సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇట్టి ఘటనపై మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇచ్చోడ మండ లం ముక్రా (బి) గ్రామంలో శనివారం ఎనిమిది మంది యువకులు కలిసి గ్రామ సమీపంలోని ఓబావిలో ఈతకు వెళ్లగా అందులో ఒకరు మరణించారని తెలిపారు. ఈ సంఘటనపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగిందని చెప్పారు.
 
ఇట్టి విషయంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై ప్రత్యేక బృందం ద్వారా నిఘా పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటనపై ప్రజలు ఎలాంటి దుష్ప్రచారాలు వ్యాప్తి చేయకుండా ఉండాలన్నారు. సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన వాట్సాప్ నందు షేర్ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసు కోబడతాయని, వాట్సప్ అడ్మిన్లు విషయాన్ని ఎప్పటి కప్పుడు గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించిన వారి సందేశాలను వెంటనే తొలగించాలని సీఐ సూచించారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.