-Advertisement-

GST తగ్గింపు చారిత్రక నిర్ణయం

GST 2.0 list , GST reduction list , New GST rates list 2025 , GST reforms 2025 list , GST 2.0 list pdf GST reforms 2025 pdf , New GST rates List
Vaasthava Nestham
దసరా, దీపావళి పండుగ వేల ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయాన్ని ప్రకటించి పన్నుల భారం తగ్గిస్తూ దేశ ప్రజలకు పండుగ బహుమతి అందించింది.

UPA పాలనలో ఒక వస్తువుపై ఒకేసారి 30–35% వరకు పన్నులు వేసేవారు. VAT, ఎక్సైజ్, ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఇలా ప్రజల మీద భారం మాత్రమే పెంచారు. ప్రతి రాష్ట్రం వేర్వేరు పన్నులు వేసేది.
 దీంతో వ్యాపారాలు గందరగోళంలో, ప్రజలు అధిక ధరల్లో నలిగిపోయారు. కానీ మోదీ ప్రభుత్వం GST ద్వారా ఒకే దేశం – ఒకే పన్ను – ఒకే మార్కెట్ అనే విప్లవాత్మక మార్పు తీసుకువచ్చింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన పదేళ్లలో పన్నులు పెంచలేదు, గత కాంగ్రెస్ UPA పాలనలో ఉన్న పన్నులను యధావిధిగా కొనసాగించి అన్నిటిని GST లోకి ఏకీకృతం చేశారు.

కానీ "ఇప్పుడు దేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా ప్రజలకు పన్నుల నుండి భారీ ఊరట నిస్తూ చరిత్రాత్మక నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం తీసుకుంది".
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ GST కౌన్సిల్ సమావేశంలో ప్రజలకు భారీఊరట కల్పించారు. ఆగస్టు 15 న ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో GST లో తదుపరి సంస్కరణలను తీసుకురావాలన్న మోదీ సంకల్పాన్ని GST కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది ప్రజలకు తీపికబురు అందించింది. దేశ ప్రజల రోజువారీ ఖర్చులు తగ్గేలా, ఆహారం,ఆరోగ్యం మరియు వ్యవసాయం, వ్యవసాయ వినియోగ వస్తువులపై GST తగ్గిస్తూ, మరోవైపు విలాస వస్తువులపై పన్ను పెంచుతూ 56వ GST కౌన్సిల్ సమావేశం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఈ మార్పులు సాధారణ కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా మెరుగైన జీవనానికి అండగా నిలుస్తుంది. 

పాలు & పాల ఉత్పత్తుల పై తగ్గింపు..


పాల ఆధారిత వస్తువులపై పన్ను తగ్గింపు మధ్యతరగతి ప్రజలకు, గృహిణులకు పెద్ద ఉపశమనాన్ని కలిగించింది.

👉 UHT పాలు & ప్యాక్ చేసిన పనీర్ పై GST పూర్తిగా తొలగింపు
👉 నెయ్యి , బట్టర్, చీజ్ → 12% నుండి 5% GST 
👉 కండెన్స్‌డ్ మిల్క్ → 12% నుండి 5% GST
ఈ నిర్ణయం ద్వారా గృహ ఖర్చులు తగ్గి, పాల ఉత్పత్తులు మరింత చవకగా అందుబాటులోకి రానున్నాయి.


 పండ్లు & డ్రై ఫ్రూట్స్ పై తగ్గింపు..


👉 బాదం, పిస్తా, వేరుశెనగలు, డ్రై ఫ్రూట్స్ → 12% నుండి 5% GST 
👉 ఖర్జూరం, అత్తి, డ్రై మామిడి, అనాస → 12% నుండి 5% GST 
ఆరోగ్యకర ఆహార వస్తువులు ఇకపై విలాస వంతమైన కుటుంబాలకు మాత్రమే కాదు సాధారణ కుటుంబాల బడ్జెట్‌కు సరిపోయేలా మారాయి. దీంతో పోస్టికాహారం మధ్యతరగతి ప్రజలకు చేరువయ్యి వారి ఆరోగ్య ప్రమాణాలను మెరుగు పరుస్తోంది.

 మిఠాయిలు & ఆహారంపై తగ్గింపు..


పిల్లలు, యువత ఎక్కువగా ఇష్టపడే ఆహారంపై GST తగ్గించడం అనేది ఆనందించే విషయం, ఇకపై అధిక ధరల్లో లభించే నాణ్యమైన వస్తువులు చవకగా లభిస్తుంది.
👉 చాక్లెట్లు & కోకో ఉత్పత్తులు → 18% నుండి 5% GST 
👉బిస్కెట్లు, కేకులు, పేస్ట్రీలు → 18% నుండి 5% GST 
👉పాస్తా, నూడుల్స్, మాకరోని → 12% నుండి 5% GST 
👉జామ్, జెల్లీ, మార్మలేడ్ → 12% నుండి 5% GST 
👉ఐస్‌క్రీమ్ → 18% నుండి 5% GST 
👉నమకీన్, భుజియా, మిక్స్‌చర్ → 12% నుండి 5% GST 
ఇంతకాలం “లగ్జరీ ఫుడ్”గా పరిగణించిన వస్తువులు ఇప్పుడు సాధారణ వినియోగ వస్తువులుగా మారి అందరికి అందుబాటులోకి రానున్నాయి.

 ప్రజల ఆరోగ్యంపై గణనీయ ముందడుగు..


ప్రజల ఆరోగ్యం, మందులపై GST కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ఎందరో జీవితాల్లో వెలుగు నింపనుంది, ముక్యంగా క్యాన్సర్ మరియు అరుదైన ప్రాణాంతక వ్యాధుల బాధితులకు భారీ ఉపశమనాన్ని కలిగిస్తుంది.
👉 క్యాన్సర్ & అరుదైన వ్యాధుల మందులు → 12% నుండి 0% GST
👉 ఆక్సిజన్, థర్మామీటర్, గ్లూకోమీటర్, ఎక్స్‌రే యంత్రాలు → 12–18% నుండి 5% GST 
👉 బాండేజీలు, మెడికల్ గ్లౌవ్స్ → 12% నుండి 5% GST 
తీవ్రమైన రోగాల చికిత్స మరింత అందుబాటులోకి రావడమే కాకుండా ప్రజల ఆరోగ్య ఖర్చుల్లో భారీ తగ్గింపును కల్పిస్తుంది.

 వ్యవసాయానికి వెన్నుదన్ను..

ప్రస్తుత పన్ను తగ్గింపు నిర్ణయాలు వ్యవసాయానికి ప్రోత్సాహాన్ని అందిస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తుంది.
👉 ట్రాక్టర్ టైర్లు, ట్యూబులు, విడిభాగాలు → 18% నుండి 5% GST 
👉 డ్రిప్ ఇరిగేషన్ నాజిల్స్ & స్ప్రింక్లర్లు → 12% నుండి 5% GST 
👉 వ్యవసాయ యంత్రాలు (హార్వెస్టర్, ఇంజిన్, పంపులు) → 18% నుండి 5% GST
👉 బయో-పెస్టిసైడ్లు → 12% నుండి 5% GST
రైతుల ఇన్పుట్ ఖర్చులు తగ్గి, వ్యవసాయం మరింత లాభదాయకంగా మారనుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందేందుకు రైతాంగానికి మెరుగైన భవిష్యత్ కోసం ఇది తోడ్పడుతుంది.

నిత్యావసర వస్తువులపై పన్ను తగ్గింపు..


ప్రజల నిత్యావసర వస్తువులపై పన్ను తగ్గించడం వల్ల దేశంలోని ప్రతీ ఒక్కరికీ ఆర్థిక నష్టాన్ని దూరం చేస్తుంది, ఈ నిర్ణయం ప్రజల్లో ఆనందాన్ని కలిగిస్తుంది.
👉 సబ్బు, షాంపూ, హెయిర్ ఆయిల్ → 18% నుండి 5% GST 
👉 టూత్‌పేస్ట్, టూత్‌పౌడర్ → 12–18% నుండి 5% GST 
👉 టాల్కం పౌడర్ → 18% నుండి 5% GST 
👉 కాండిల్స్ → 12% నుండి 5% GST 
ప్రతి ఇంటి నెలవారీ ఖర్చులో గణనీయ తగ్గింపుకి ఇది దోహదం చేస్తుంది.

GST సంస్కరణ విద్యార్థులకు వరం..


👉నోటుబుక్స్ పై గతంలో పన్ను15% ఉండగా ఇప్పుడు పూర్తిగా ఉచితం
👉పెన్సిల్,జ్యమెట్రి బాక్స్ పై 12 నుండి 18 శాతం ఉన్న పన్నును ఎత్తేసి నూతన GST లో 5శాతం మాత్రమే విధించారు.
👉స్కూల్ బ్యాగ్స్ పై 20-22 శాతం ఉన్న పన్నును తగ్గించి 5 శాతం విధించారు.
👉డ్రాయింగ్ బుక్స్, ఆర్ట్స్ & క్రాఫ్ట్ మెటీరియల్ పై 18 శాతం ఉన్న పన్నును 5 శాతానికి తగ్గించారు.
👉బ్లాక్ బోర్డు, ల్యాబ్ వస్తువులపై 15 శాతం ఉన్న పన్నులను పూర్తిగా ఎత్తివేశారు.

సామాన్యుడికి లాభం, విలాసానికి భారం..

ఆహారం, ఆరోగ్యం, వ్యవసాయం, రోజువారీ వస్తువులపై పన్ను తగ్గించడం ద్వారా సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.
లగ్జరీ కార్లు, సిగరెట్లు, ఆల్కహాల్ లాంటి విలాస వస్తువులపై పన్ను పెంచడం ద్వారా సమాజానికి సమతుల్యం తీసుకురావడానికి మరియు దురలవాట్లను తగ్గించేందుకు ఉపయోగపడనుంది. అంతర్జాతీయ ఒత్తిడుల మధ్యలో మోదీ ప్రభుత్వం వినియోగ వస్తువులపై GST సంస్కరణ చేసి, పెద్ద మొత్తంలో రేట్లను సవరించడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. ముఖ్యమైన వస్తువులపై రేట్లు తగ్గించబడి, కొత్త ప్రధాన స్లాబ్స్ అలాగే 22 సెప్టెంబర్ 2025 నుంచి అమలులోకి వస్తాయి. ఇది గృహ సర్వసాధారణులకు తక్షణ ఉపశమనాన్ని ఇవ్వబోతుంది. మొత్తంగా 56వ GST కౌన్సిల్ సమావేశం సాధారణ భారతీయ కుటుంబం ఖర్చులను తగ్గించడమే కాకుండా, ఆరోగ్య–వ్యవసాయ రంగాలకు నూతన ఊపిరి నింపి చరిత్రలో నిలిచిపోనుంది. మోదీ ప్రభుత్వానికి ఇదో మైలురాయిగా నిలవనుంది. 
Vaasthava Nestham Telugu Daily


Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.