-Advertisement-

గోడ కూలి ఇద్దరి దుర్మారణం.. ఒకరికి తీవ్ర గాయాలు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున పురాతన రైస్ మిల్ గోడ కూలీ ఇంటిపై పడడంతో ఆ ఇంటిలో నిధ్రిస్తున్న యువకుడితోపాటు నెలన్నర చిన్నారి మృతి చెందింది.. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం..
 
మాలవాడకు చెందిన ఇందూర్ ప్రకాష్(మహేష్) , భార్య మహేశ్వరి, తమ నెలన్నర కూతురు తో వారి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వారి ఇంటికి ప్రక్కనే ఉన్న పాడుబడ్డ రైస్ మిల్ గోడ ఒక్కసారి కూలింది. పక్కన ఉన్న కూనిళ్లు పై పడటంతో అందులో నిద్రిస్తున్న ఇందూర్ ప్రకాష్(మహేష్), రెండు నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, స్థానికులు గమనించి వెంటనే మట్టిని తొలగించడంతో మహేశ్వరి గాయాలతో బయటపడడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కూలిపని చేసుకునే పొట్ట నింపుకునే మహేష్, తన కూతురు దుర్మరణం స్థానికంగా కలిచివేసింది. రైస్ మిల్ యాజమాన్యం పై చర్య తీసుకుని మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.