Gram Panchayat Secretary : నిర్లక్ష్యంగా వాహనం నడిపి.. బతుకమ్మ గద్దెను కారుతో ఢీ కొట్టిన పంచాయతీ సెక్రటరీ
Telangana bathukamma , Bathukamma 9 days names , About Bathukamma in Telugu , Bathukamma 2025 start and end date
By
Vaasthava Nestham
• ఆదిలాబాద్ జిల్లా జందాపూర్,లో ఘటన
• ఆపై మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన పంచాయతీ సెక్రెటరీ
• పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.. శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: నిర్లక్ష్యంగా వాహనం నడిపి బతుకమ్మ గద్దెను కారుతో ఢీకొని ఆపై మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన పంచాయతీ సెక్రటరీ పై కేసు నమోదు చేసి శాఖపరమైన చర్యల కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేయడం జరిగిందని ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిదర్ తెలిపారు. సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం..
ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ గ్రామంలో సోమవారం జందాపూర్ గ్రామపంచాయతీ సెక్రటరీ ( Gram Panchayat Secretary )సుల్తానా బేగం నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి అదే గ్రామంలోని బతుకమ్మ ( Bathukamma Sambaralu )గద్దె పైనుండి వాహనాన్ని తీసుకువెళ్లడమే కాకుండా మహిళలతో నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ, మహిళల పట్ల బతుకమ్మ పట్ల దుర్భాషలాడినట్లు గ్రామ మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ ఘటనపై సదరు పంచాయతీ సెక్రెటరీ పై శాఖ పరంగా చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ఆయన తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ఇతరులకు ప్రమాదం కలిగేలా, సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి పండుగలను అవమానించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ , సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.
Comments