-Advertisement-

ప్రజల సంరక్షణ, భద్రతకై కమ్యూనిటీ కాంటాక్ట్,ల నిర్వహణ

Vaasthava Nestham

• కేశవపట్నం,లో కార్డెన్ అండ్ సెర్చ్
• 82 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలు, ఒక మాక్స్ స్వాధీనం
• నార్కోటిక్ డాగ్ రొమ తో గంజాయి పై తనిఖీ
• జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ప్రజల రక్షణ, భద్రతకై కార్డెన్ అండ్ సెర్చ్ లను నిర్వహించడం జరుగుతుందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం తెల్లవారుజామున ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం గ్రామంలో ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో సరైన ధ్రువపత్రాలేని 82 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలు, ఒక మ్యాక్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మొదటగా గ్రామాన్ని అధికారులతో కలిసి తిరిగి విద్యార్థులకు చదువుపై ఉన్న ప్రాధాన్యతను తెలియజేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని తల్లిదండ్రులు యువతకు చదువుకునేలా ప్రోత్సహించాలని, చదువు వలన భవిష్యత్తు, మంచి పేరు లభిస్తాయని సూచించారు. గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా ఉండాలని సూచించారు. 
ఒకే గ్రామం నుండి గత ఐదు సంవత్సరాలలో 90 కేసులు నమోదు అయ్యాయని, ఇక నుండి సన్మార్గంలో వెళ్లాలని సూచించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనని వారిపై ఒక సంవత్సరం పాటు పరిశీలించి రౌడీ షీట్లను, సస్పెక్ట్ షీట్లను ఎత్తివేయడం జరుగుతుందని తెలిపారు. అక్రమంగా కలప రవాణాను, చెట్లను నరికి వేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. వాహనాలలో ప్రయాణించేటప్పుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. రానున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా ప్రతి ఒక్కరు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యతను తెలియజేస్తూ వాటి ఏర్పాటకు కృషి చేయాలని తెలిపారు. మహిళల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ ఉండాలని ఎలాంటి గృహహింస చర్యలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు. రాత్రి సమయాలలో అనవసరంగా తిరగరాదని, ఈవిటీజింగ్ మరియు మహిళలను వేధించడం లాంటివి నిర్వహించకూడదని, గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి పోతారం శ్రీనివాస్, ఇచ్చోడ సిఐ బండారి రాజు, ఉట్నూర్ సీఐ ఎం ప్రసాద్, ఎస్సైలు వి పురుషోత్తం, వి సాయన్న, ఎల్ శ్రీకాంత్, ఇమ్రాన్, రాధిక, పూజ, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అన్వర్ ఉల్ హక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.